తస్సాదియ్య! సరదాగా పార్క్‌కి వెళ్తే..క్రేజీ డైమండ్ దొరికింది

డైమండ్ పార్కు అనే పేరున్నంత మాత్రన అక్కడ డైమండ్స్ దొరుకుతాయా? అనుకోకండి. అవి దొరకబట్టే సదరు పార్క్‌కి ఆ పేరొచ్చింది. వాటి కోసం ఆసక్తి ఉన్నవారు రెగ్యులర్‌గా అక్కడికి వెళ్లి వజ్రాల కోసం సెర్చ్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని డైమండ్స్ స్టేట్ పార్కులో ఓ విజటర్‌కి వజ్రం దొరికడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబవుతుంది. మిరండా హొల్లింగ్ హెడ్ (27)తన కుటుంబంతో కలిసి అర్కాన్సస్ లోని డైమండ్స్ స్టేట్ పార్కుకు వెళ్లింది. మిరండా పార్కులో ఈశాన్యంలో ఉన్న కొండప్రాంతంలో […]

తస్సాదియ్య! సరదాగా పార్క్‌కి వెళ్తే..క్రేజీ డైమండ్ దొరికింది
Texas woman finds 3.72-carat diamond at Arkansas state park
Follow us

|

Updated on: Aug 23, 2019 | 3:29 PM

డైమండ్ పార్కు అనే పేరున్నంత మాత్రన అక్కడ డైమండ్స్ దొరుకుతాయా? అనుకోకండి. అవి దొరకబట్టే సదరు పార్క్‌కి ఆ పేరొచ్చింది. వాటి కోసం ఆసక్తి ఉన్నవారు రెగ్యులర్‌గా అక్కడికి వెళ్లి వజ్రాల కోసం సెర్చ్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని డైమండ్స్ స్టేట్ పార్కులో ఓ విజటర్‌కి వజ్రం దొరికడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబవుతుంది. మిరండా హొల్లింగ్ హెడ్ (27)తన కుటుంబంతో కలిసి అర్కాన్సస్ లోని డైమండ్స్ స్టేట్ పార్కుకు వెళ్లింది. మిరండా పార్కులో ఈశాన్యంలో ఉన్న కొండప్రాంతంలో కూర్చొని.. వజ్రాలను గుర్తించడమెలా అనే వీడియోను యూట్యూబ్ లో చూస్తూ ముందుకు చూసింది. అక్కడే మెరిసే రత్నం కనిపించింది. ఇంకేముంది.తీరా చూస్తే అది 3.72 క్యారెట్ల డైమండ్. వజ్రాలను కనుగొనడం ఎలా అని యూట్యూబ్ లో చూస్తున్న సమయంలో ఇలా వజ్రం దొరకడంతో నేను భావోద్వేగానికి లోనయ్యానని మిరండా చెప్పింది. 2017 మార్చి నుంచి పార్కు సందర్శకులకు దొరికిన పెద్ద డైమండ్ ఇదేనని, 2013 అక్టోబర్ నుంచి దొరికిన పచ్చ వజ్రాల్లో కూడా ఇదే అతిపెద్దదని పార్కు అధికారులు తెలిపారు.