‘ఒట్టు ! మా దగ్గర మూడు వైరస్ లు ఉన్నా.. అవి కోవిడ్-19′ కావు’. వూహాన్ ల్యాబ్ డైరెక్టర్ .

తమ ల్యాబ్ లో గబ్బిలాలకు సంబంధించి మూడు వైరస్ లు ఉన్నప్పటికీ. అవి కోవిడ్-19 వైరస్ తో మ్యాచ్ కావని చెబుతోంది వూహాన్ వైరాలజీ ఇన్స్ టి ట్యూట్  డైరెక్టర్ వాంగ్  యానీ ! అసలు మా దగ్గరి వైరస్ లకు, సార్స్-కోవ్-2  వైరస్ కి పోలికే లేదు అని ఆమె తెలిపింది. ఈ వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టిందని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. మా మూడు వైరస్ […]

'ఒట్టు ! మా దగ్గర మూడు వైరస్ లు ఉన్నా.. అవి కోవిడ్-19'  కావు'. వూహాన్ ల్యాబ్ డైరెక్టర్ .
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 7:36 PM

తమ ల్యాబ్ లో గబ్బిలాలకు సంబంధించి మూడు వైరస్ లు ఉన్నప్పటికీ. అవి కోవిడ్-19 వైరస్ తో మ్యాచ్ కావని చెబుతోంది వూహాన్ వైరాలజీ ఇన్స్ టి ట్యూట్  డైరెక్టర్ వాంగ్  యానీ ! అసలు మా దగ్గరి వైరస్ లకు, సార్స్-కోవ్-2  వైరస్ కి పోలికే లేదు అని ఆమె తెలిపింది. ఈ వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టిందని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. మా మూడు వైరస్ లు కోవిడ్-19 తో 79.8 శాతం మాత్రమే మ్యాచ్ అవుతాయని ఆమె చెప్పింది.  తమ సెంటర్ కొన్ని కరోనా వైరస్ లను గబ్బిలాల నుంచి సేకరించిన మాట నిజమేనని, కానీ వారిని ఐసొలేట్ చేశామని వాంగ్ వెల్లడించింది. ‘సార్స్-కొవ్-2 జీనోమ్ ఎనభై శాతం సార్స్ జీనోమ్ ని పోలి ఉంటుందన్న విషయం తమకు తెలుసునని ఆమె పేర్కొంది. అసలు 2004 నుంచే షీ జెంగ్లీ అనే రీసర్చర్ గబ్బిలాల కరోనా వైరస్ ల మీద పరిశోధనలు చేస్తూ వచ్చారు.రెండు దశాబ్దాల క్రితం మరో వైరస్ పుట్టడానికి వెనుక అసలు సార్స్ సోర్స్ ఏమిటో తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నించారు. అయితే ఆ ప్రొఫెసర్ సార్స్ వైరస్ లను పోలి ఉండే వైరస్ లపై శ్రద్ధ పెట్టలేదు అని వాంగ్ వివరించింది. గత డిసెంబరు 30 న తమవద్దకు సార్స్-కొవ్-2 నమూనాలు వచ్చాయని, జనవరి రెండో తేదీ నాటికి దాని జన్యు క్రమాన్ని ఛేదించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశామని ఆమె తెలిపింది.

ఇక పోతే అసలు కరోనా వైరస్ లు ఉన్న విషయమే తమకు తెలియదని, అలాంటప్పుడు తమ ల్యాబ్ నుంచి ఎలా లీక్ అవుతాయని ఆమె అమాయకంగా ప్రశ్నించింది. అసలు ఈ వైరస్ ల బాగోతం గురించి చైనాకు ముందే తెలుసునని ప్రపంచ దేశాలు గొంతెత్తి అరుస్తున్నాయి. అయినా చైనా మాత్రం తమకేమీ తెలియదని పదేపదే పాత పాటే పాడుతోంది. కరోనా వైరస్ గురించి అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కి జనవరి 7 నే తెలుసునని, హుబీ ప్రావిన్స్ లో మాత్రమే (జనవరి 23 న ) లాక్ డౌన్ విధించారని భావిస్తున్నారు. కరోనా హ్యూమన్ ట్రాన్స్ మిషన్ యవ్వారం గురించి తెలిశాక.. కరోనా వ్యాధి చికిత్సలో ఉపయోగించే రెమ్ డెసివిర్ మెడిసిన్ పేటెంట్ కోసం చైనా యత్నించిందట. వూహాన్ లోని ల్యాబే దీనికోసం దరఖాస్తు పెట్టుకుందని కూడా తెలియవచ్చింది.

.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు