ఈ గొర్రెల కాపరి ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్

రోజు రోజుకు సోషల్ మీడియా విస్తరిస్తోన్న నేపథ్యంలో చాలా మంది ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇక డబ్‌స్మాష్, టిక్‌టాక్‌లు వచ్చిన తరువాత ఎంతోమంది టాలెంట్ బయట పడుతోంది. తాజాగా వీడియోతో ఓ గొర్రెల కాపరి ఇంటర్నెట్‌లో స్టార్‌గా మారిపోయాడు. 1994లో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘హమ్ ఆప్కే హై కౌన్’ చిత్రంలోని ‘హే మౌసమ్ కా జాదు హై మిత్వా’ పాటలో ‘ఇన్కో హమ్ లే కే […]

ఈ గొర్రెల కాపరి ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 5:10 PM

రోజు రోజుకు సోషల్ మీడియా విస్తరిస్తోన్న నేపథ్యంలో చాలా మంది ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇక డబ్‌స్మాష్, టిక్‌టాక్‌లు వచ్చిన తరువాత ఎంతోమంది టాలెంట్ బయట పడుతోంది. తాజాగా వీడియోతో ఓ గొర్రెల కాపరి ఇంటర్నెట్‌లో స్టార్‌గా మారిపోయాడు. 1994లో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘హమ్ ఆప్కే హై కౌన్’ చిత్రంలోని ‘హే మౌసమ్ కా జాదు హై మిత్వా’ పాటలో ‘ఇన్కో హమ్ లే కే చలే హై, అప్నే సాంగ్ అప్నీ నగరియా’ అంటూ సాగే రిలిక్‌కు ఆ గొర్రెల కాపరి సరిపోయే లిప్ సింక్‌ను ఇచ్చాడు. ఇక ఆ వీడియోలో అతడి పలికించిన హావ భావాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే నవ్వుకు తగ్గట్లుగా ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్షల వ్యూస్, కామెంట్లతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.