బాడీ సూట్‌తో పిల్లలకు పాఠాలు.. టీచర్ ఫన్నీ ప్రయోగాలు

స్పెయిన్ లో ఓ టీచరమ్మ తన స్కూలు పిల్లలకు వెరైటీగా పాఠాలు చెబుతోంది. వెరోనికా డ్యూక్ అనే ఈమె.. బయాలజీ క్లాస్ లో విద్యార్థులకు లెసన్స్ చెబుతున్నతీరు వైరల్ అయింది. మానవ అంతర్గత అవయవాలను ప్రింట్ చేసిన సూట్ ధరించి ఈమె ఇలా బోధించడం ఫన్నీగా ఉన్నా.. విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సైన్స్, ఇంగ్లీష్, ఆర్ట్, సోషల్ స్టడీస్, స్పానిష్ సబ్జెక్టులను కూడా బోధించే వెరోనికా వయస్సు 43 ఏళ్ళు. టీచింగ్ లో ఈమెకు 15 ఏళ్ళ […]

బాడీ సూట్‌తో పిల్లలకు పాఠాలు.. టీచర్ ఫన్నీ ప్రయోగాలు
Follow us

|

Updated on: Dec 25, 2019 | 5:18 PM

స్పెయిన్ లో ఓ టీచరమ్మ తన స్కూలు పిల్లలకు వెరైటీగా పాఠాలు చెబుతోంది. వెరోనికా డ్యూక్ అనే ఈమె.. బయాలజీ క్లాస్ లో విద్యార్థులకు లెసన్స్ చెబుతున్నతీరు వైరల్ అయింది. మానవ అంతర్గత అవయవాలను ప్రింట్ చేసిన సూట్ ధరించి ఈమె ఇలా బోధించడం ఫన్నీగా ఉన్నా.. విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సైన్స్, ఇంగ్లీష్, ఆర్ట్, సోషల్ స్టడీస్, స్పానిష్ సబ్జెక్టులను కూడా బోధించే వెరోనికా వయస్సు 43 ఏళ్ళు. టీచింగ్ లో ఈమెకు 15 ఏళ్ళ అనుభవం ఉందట.. తాను ఇంటర్నెట్ ని సెర్చ్ చేస్తుండగా చటుక్కున ఓ యాడ్ చూసి.. దాని ప్రభావంతో ఇలా టీచ్ చేశానని వెరోనికా చెబుతోంది. పిల్లలకు సులభంగా పాఠాలు అర్థం కావాలంటే ఇలా బాడీ సూట్ ధరించడమే మేలని అంటోంది. పైగా వారికి ఇది తమాషాగా, వింతగా కూడా ఉంటుందని తెలిపింది. మానవ అంతర్గత అవయవాలపై ఈ చిన్నారులకు (మూడో తరగతి విద్యార్థులకు) ఉండే అవగాహన తక్కువని, ఇలా చేస్తే వారు సులువుగా అర్థం చేసుకుంటారన్నది ఆమె అభిప్రాయం.

ఎనాటమీ సూట్ ధరించి తన భార్య ఇలా పాఠాలు బోధిస్తున్న ఫోటోలను ఆమె భర్త మైక్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వాటికి పదమూడు వేల రీట్వీట్లు, 66 వేల లైక్స్ వచ్చాయి. తన భార్యకు కలిగిన ఇలాంటి సరికొత్త ఐడియాకు తానెంతో గర్విస్తున్నానని, మైక్ అనే ఆయన పేర్కొన్నాడు. వెరోనికా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.. వ్యాకరణ అంశాల్లో నౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్ వంటివి దొర్లినప్పుడు సంబంధిత కార్డ్ బోర్డ్ క్రౌన్లను ధరించి పాఠాలు చెప్పేదట. ఈ సమాజంలో పిల్లలకు బోరింగ్ గా, లేజీగా లెసన్స్ చెప్పే టీచర్లు ఉంటారనే అపోహలు తప్పని నిరూపించడానికే ఇలా ఫన్నీగా ప్రయోగాలు చేస్తున్నానని వెరోనికా అంటోంది.