Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

థాయ్‌లాండ్‌లో విజయ్ దేవరకొండ.. ఏం చేస్తున్నాడంటే..!

Vijay Deverakonda movies, థాయ్‌లాండ్‌లో విజయ్ దేవరకొండ.. ఏం చేస్తున్నాడంటే..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఫైటర్ అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా దీన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ నెలాఖరులో సెట్స్ మీదకు వెళ్లనుంది.

అయితే ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ థాయ్‌లాండ్‌కు వెళ్లారట. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించనుండగా.. అందుకోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. దాదాపు 15మంది ట్రైనర్లు మిక్స్‌డ్ మార్షియల్ ఆర్ట్స్‌తో పాటు పలు విద్యల్లో అతడికి శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో కొత్త లుక్‌లో కనిపించబోతోన్న విజయ్.. అందుకోసం ప్రత్యేకంగా డైట్‌ను ఫాలో అవుతున్నట్లు టాక్. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

కాగా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇష్‌బెల్లా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Related Tags