Stamina Double: వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..

|

Nov 20, 2024 | 4:38 PM

శరీరం దృఢంగా, బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, బిజీ లైఫ్‌స్టైల్, దిగజారుతున్న ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా శరీరం చాలా బలహీనపడుతుంది. అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది. యువకుల శరీరం కూడా ఉండాల్సినంత చురుకుగా ఉండటం లేదు. దీంతో.. వాళ్ల స్టామినా కూడా తగ్గుతోంది. చాలా మంది మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి పీల్చుకోవడం లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు చాలా త్వరగా అలసిపోతుంటారు.

కొందరు కండ బలం పెంచడానికి జిమ్‌లు చుట్టూ తిరుగుతుంటారు. వీక్‌గా ఉన్నవారు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, కండ బలంతో పాటు స్టామినా పెంచుకోవాలంటే డైట్‌లో కొన్ని సూపర్ ఫుడ్స్ చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. వీటిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా కండ బలం పెరిగి.. స్టామినా కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు బలహీనంగా ఉంటే.. శక్తిని పెంచుకోవడానికి పీనట్ బటర్ ఉపయోగించుకోవచ్చు. పీనట్ బటర్‌లో ప్రోటీన్, ఒమేగా 3, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కండరాలు బలపడతాయి. అందుకే జిమ్‌కి వెళ్లేవారు ఎక్కువగా పీనట్ బటర్ తింటుంటారు. పీనట్ బటర్ పాలతో లేదా రోటీ లేదా బ్రెడ్‌తో తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. బాదంపప్పు తీసుకోవడం వల్ల కూడా శరీరం స్టామినా పెరుగుతుంది. బాదంలో ప్రొటీన్లు, విటమిన్ ఇ, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. బాదం పప్పు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి పవర్ అందుతుంది. కండరాలు కూడా బలపడతాయి. నానబెట్టిన బాదం పప్పు లేదా వేయించిన వాటిని తినడం వల్ల లాభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.

అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని. అరటి పండు శక్తి స్థాయిల్ని పెంచుతుంది. రోజూ ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి పుష్కలంగా శక్తి లభిస్తుంది. కండ బలం కూడా పెరుగుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.