ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య

Updated on: Oct 05, 2023 | 1:00 PM

తనకోసం ప్రాణాలు వదిలిన ప్రియుడ్ని విడిచి ఉండలేక ప్రియురాలు కూడా ఉరివేసుకొని చనిపోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నేహా అనే యువతి, హైదరాబాద్‌ జర్నలిస్ట్‌ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ.. నానక్‌రాంగూడలోని ఓ బేకరీలో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తోంది. అదే బేకరీలో పనిచేస్తోన్న సల్మాన్‌ అనే యువకుడితో స్నేహం ప్రేమగా మారింది.

తనకోసం ప్రాణాలు వదిలిన ప్రియుడ్ని విడిచి ఉండలేక ప్రియురాలు కూడా ఉరివేసుకొని చనిపోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నేహా అనే యువతి, హైదరాబాద్‌ జర్నలిస్ట్‌ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ.. నానక్‌రాంగూడలోని ఓ బేకరీలో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తోంది. అదే బేకరీలో పనిచేస్తోన్న సల్మాన్‌ అనే యువకుడితో స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలనుకున్నారు. సల్మాన్‌ తన ప్రేమగురించి ఇంట్లోని పెద్దలకు చెప్పాడు. వారి నిరాకరించడంతో మనస్తాపం చెందిన సల్మాన్‌ అక్టోబరు 1న ఉత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణవార్త విన్న నేహా తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. అక్టోబరు 3న తన రూమ్‌ మేట్స్‌ డ్యూటీకి వెళ్లగానే హాస్టల్‌ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం పదిన్నర గంటల సమయంలో హాస్టల్‌ సిబ్బంది రూమ్‌ శుభ్రం చేసేందుకు వెళ్లి తలుపు కొట్టగా ఎంతకీ డోర్‌ తెరవకపోవడంతో అనుమానం వచ్చి, కిటికీలోంచి చూశారు. నేహా ఫ్యానుకు ఉరివేసుకొని ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.