ట్రంప్ ’15 సూత్రాల’ శాంతి ప్రణాళిక .. ఇక యుద్ధానికి తెర?
ఇరాన్‌తో నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా కీలక ముందడుగు వేసింది. యుద్ధాన్ని నిలిపివేసి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు 15 సూత్రాలతో కూడిన ఒక విస్తృత ప్రణాళికను ఇరాన్‌కు పంపింది. మరోవైపు, ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం, అమెరికా పంపిన ఈ ప్రణాళికలో అత్యంత కఠినమైన, కీలకమైన డిమాండ్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఇరాన్‌లోని ప్రధాన అణు కేంద్రాలైన నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను పూర్తిగా మూసివేయాలి. యురేనియం శుద్ధిని తక్షణమే ఆపివేయాలి. ఇప్పటివరకు సేకరించిన అణు ఇంధనాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)కు అప్పగించాలి. బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని అమెరికా డిమాండ్ చేసింది. ఇరాన్ ఈ షరతులకు అంగీకరిస్తే, అమెరికా కూడా భారీ రాయితీలను ప్రకటించింది. అందులో భాగంగా ఇరాన్‌పై విధించిన అన్ని అణు సంబంధిత ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అంతేకాకుండా, విద్యుత్ ఉత్పత్తి కోసం బుషెహర్‌లో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి మద్దతు ఇస్తామని తెలిపింది. ఆంక్షలను తిరిగి విధించే “స్నాప్‌బ్యాక్” విధానాన్ని కూడా రద్దు చేస్తామని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :