అమెరికాలో 170 ఏళ్లుగా మంగళవారమే.. ఎందుకు ఎన్నికలు జరుపుతున్నారు ??
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ 5న ఓటింగ్ జరగనుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నెలకొంది. కమలా హారిస్ గెలిస్తే తొలిసారి అధ్యక్షురాలిగా, ట్రంప్ గెలిస్తే రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
అమెరికా రాజకీయాలలోని ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన పోటీపై యావత్ ప్రపంచం ఫోకస్ పెట్టింది. అదే సమయంలో అమెరికా ఎన్నికలకు సంబంధించి ఓ ఆచారం కొనసాగుతూ వస్తోంది. అమెరికాలో నవంబర్ మొదటి మంగళవారం రోజునే ఎన్నికలు జరుగుతాయి. ఇది 170 ఏళ్లుగా ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. 2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న, అదే విధంగా 2028లో నవంబర్ 7న (మంగళవారం) ఓటింగ్, 2032లో నవంబర్ 2న (మంగళవారం) ఓటింగ్ జరగనుంది. అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. జనవరి 23, 1845న US కాంగ్రెస్‌లో ఒక చట్టాన్ని ఆమోదించారు. US ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలను నిర్వహించడం గురించి ఇందులో ప్రస్తావించారు. నవంబర్‌లో మొదటి మంగళవారం నాడు ప్రతి రాష్ట్రంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నికలను నిర్వహించాలని చట్టం పేర్కొంది. ఒకవేళ ఏవైనా రాష్ట్రాలు ముందస్తుగా ఎన్నికలను నిర్వహిస్తే.. అవి.. ఆ తరువాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఫలితాలను ప్రభావితం చేస్తాయని.. ఇలా ఒకే రోజున దేశమంతా ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే కుటుంబంలో 5 రోజుల్లో ఐదుగురిని కాటేసిన ఒకే పాము !!
మందేసి.. దోసె తింటే మీ పని మటాష్ !! ఇప్పటికైనా జాగ్రత్తపడండి