ఒకే ఒక్కడు.. అణుబాంబు మీద పడ్డా ప్రాణాలతో ..

Updated on: Apr 05, 2026 | 1:01 PM

పశ్చిమాసియాలో ఇరాన్‌ అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతోంది. అణుదాడి జరగబోతుందా అన్న ఆందోళన ప్రపంచాన్ని వణికిస్తోంది. జపాన్‌లో అమెరికా జారవిడిచినఒకటి కాదు రెండు అణుబాంబుల నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి సుటోము యమగుచి జీవితం ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది.

సుటోము యమగుచి జీవితం ఒక రకంగా అత్యంత దురదృష్టకరం. మరో విధంగా అతనికి గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 1945 ఆగస్టు 6న హిరోషిమాలో మిత్సుబిషి కంపెనీలో ఇంజనీర్‌గా సుటోము యమగుచి డ్యూటీలో ఉన్నారు. సరిగ్గా ఆయన ఇంటికి వెళ్ళే సమయానికి ఆకాశంలో విమానాన్ని చూసారు. కాసేపటికే ఆ అమెరికా విమానం లిటిల్‌ బాయ్’ అణు బాంబును జారవిడిచింది. పేలుడు కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చర్మం కాలిపోయింది. వినికిడి శక్తి దెబ్బతింది. ప్రాణాలతో బయటపడిన అతనికి డాక్టర్లు చికిత్స చేసారు. ఒళ్లంతా బాండేజ్‌ కట్లతో ఆ రాత్రి వణుకుతూ గడిపిన ఆయన, స్వస్థలమైన నాగసాకికి వెళ్లిపోవాలని ఆరాటపడ్డాడు. కానీ మళ్లీ మృత్యువు వెంటాడుతుందని ఊహించలేదు. మరుసటి రోజు రైలెక్కడం కోసం స్టేషన్‌కు చేరుకున్నారు. 80 వేల మంది ప్రాణాలను బాంబు ఒక్కసారిగా తీసేసింది. శ్మశానంలా మారిన నగరాన్ని చూస్తూ రైలెక్కి తన స్వస్థలం నాగసాకికి చేరుకున్నారు. ఆగస్టు 9న నాగసాకిలో తన ఆఫీసులో కూర్చుని, హిరోషిమాలో జరిగిన విధ్వంసం గురించి తన పై అధికారికి వివరిస్తున్నారు. అతని బాస్ అతణ్ని నమ్మలేదు. అతిగా స్పందిస్తున్నాడని యమగుచిని నిందించారు.

మరిన్ని వీడియోల కోసం :

నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ

రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?

హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు

గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం

Loading...
Unable to load recommendations.
Follow Us