ఇండియా దెబ్బకు అమెరికా రివర్స్ గేమ్..

Updated on: Sep 03, 2025 | 7:13 PM

మొన్నటి వరకు సుంకాలతో భారత్‌ను బెదిరించిన అగ్రరాజ్యం అమెరికా.. ఇప్పుడు సరికొత్త రాగం అందుకుంది. ‘మీ ఇష్టం..మాతో ఉంటే లాభపడతారు. లేదంటే మీకే నష్టం’ అంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం.. ట్రూత్‌లో భారత్‌పై ట్రంప్ ఇంట్రస్టింగ్ కామెంట్ పెట్టారు. చైనా పర్యటనలో మోదీ-పుతిన్ భేటీ నేపథ్యంలో ట్రంప్ చేస్తున్న ఈ ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌ ఇలా కొనసాగుతుండగా.. మరోవైపు ఇండియాతో దౌత్యాన్ని పటిష్టపర్చుకుంటామంటూ అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది.

ట్రంప్‌ భారీ సుంకాల నేపథ్యంలో.. అమెరికాను పక్కన పెట్టిన భారత్‌ ప్రత్యామ్నాయ మార్కెట్‌ను అన్వేషిస్తోన్నవేళ అమెరికా తీరు మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇండియాపై ఎడా పెడా సుంకాలు విధిస్తే కాళ్లబేరానికి వస్తుందనున్నకున్న ట్రంప్‌ అంచనాలు తలకిందులు కావటంతో.. షాకైన ట్రంప్ మరో కొత్త నాటకానికి తెరతీశారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాకున్న అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌లలో అమెరికా ఒకటి. గత ఆర్థికసంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 79.44 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. కానీ, మనదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 41.5 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే.. దాదాపు మూడున్నర లక్షల కోట్లు. అమెరికాకు జరిగే ఎగుమతులతో పోలిస్తే ఇది దాదాపుగా సగం. ఈ తేడానే ఎక్స్‌పోజ్ చేస్తూ,‘మా అవసరం మీకు చాలా ఉంది’ అన్నట్లుగా కొంతకాలంగా ట్రంప్ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చారు. కానీ, భారత్ ఊహించని షాక్ ఇవ్వటంత ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడిపోయినట్లు కనిపిస్తోంది. షాంఘై సహకార సదస్సుకు కొద్ది నిమిషాల ముందు అమెరికా కార్యవర్గం సోషల్ మీడియా ద్వారా ఇండియాను బుజ్జగించేందుకు ప్రయత్నించింది. ఇప్పటివరకు భారత్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడిన అమెరికా స్వరంలో సడన్‌గా మార్పు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ‘భారత్‌-అమెరికా సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరుకుంటున్నాయి. ఈ నెలలో మా దోస్తీని ఇంకా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెట్టబోతున్నాం. మా ఆర్థికబంధంలోని అద్భుతమైన అవకాశాలను గుర్తించాం.’. అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. సుంకాల డ్రామాతో ఇండియాతో తెగిన దౌత్యసంబంధాలను ఏదో విధంగా పునరుద్ధరించుకోవాలన్నదే అమెరికా ప్రయత్నంగా తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హ్యాట్సాఫ్‌.. కాకి కోసం ప్రాణాలకు తెగించి

కాళ్లు చచ్చుబడిన కన్నకొడుకు.. ఇంట్లోకి రానివ్వని తండ్రి

భర్త కళ్లలో కారం కొట్టి హత్య.. కారణం ఇదే

నల్గొండ కేతమ్మకు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

లోబోకు ఏడాది జైలు శిక్ష..! ఇద్దరి చావుకు కారణం..7 ఏళ్ల తర్వాత తీర్పు