భారతీయులకు యూఏఈ కొత్త నిబంధనలు.. పాస్‌పోర్టులో పూర్తి పేరు లేకుంటే సౌదీకి నో ఎంట్రీ..

|

Nov 29, 2022 | 9:36 AM

తమ దేశానికి వచ్చే భారతీయుల పట్ల మరింత కఠినంగా వ్యవహారించాలని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నిబంధనల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

తమ దేశానికి వచ్చే భారతీయుల పట్ల మరింత కఠినంగా వ్యవహారించాలని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నిబంధనల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పాస్‌పోర్టుపై పూర్తి పేరు లేని భారతీయులు ఇకపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు విమాన ప్రయాణం చేయలేరు. కేవలం ఒక పదంతో మాత్రమే పేరు ఉండేవారిని తమ దేశంలోకి అనుమతించబోమని అన్ని విమానయాన సంస్థలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కొత్త నిబంధన నవంబరు 21 నుంచే అమల్లోకి వచ్చిందట. దీనిపై తాజాగా ఎయిరిండియా, ఇండిగో వంటి భారత ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు ఒక సర్కులర్‌ను పంపించింది. దేశంలో నివాస పర్మిట్‌ ఉన్నవారికి లేదా ఉద్యోగ వీసాలకు తప్ప మరే తరహా వీసా అయినా సరే, పాస్‌పోర్టుపై పేరు పూర్తిగా లేకపోతే యూఏఈ జారీ చేయదని అందులో వెల్లడించింది. దీంతో, పాస్‌పోర్టుపై ఒకే పదంతో పేరు ఉంటే.. అదే పేరును “first name” లేదా “surname’’ కాలమ్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే.. ఈ విషయంపై యూఏఈ రాయబార కార్యాలయం నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, ప్రయాణికులు కంగారుపడొద్దని ప్రయాణ సంస్థలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నందిగామలో అరుదైన సంఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి

భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’.. రెండు రోజుల తర్వాత..

నదిలో కుప్పలుగా శిశువుల మృతదేహాలు !! పోలీసుల విచారణలో సంచలన విషయాలు

Published on: Nov 29, 2022 09:36 AM