ఇదేం పిచ్చి.. 50 డిగ్రీల ఎండలో షికారు.. డెత్‌వ్యాలీకి పర్యాటకుల క్యూ

|

Jul 12, 2024 | 6:55 PM

వెర్రి వెయ్యి రకాలన్నట్లు.. మలమలా మాడ్చే ఎండ ఎలా ఉంటుందో చూద్దామనుకొని జనాలు ఆ ప్రదేశానికి బారులు తీరుతున్నారు. మనం ఎండ 40 డిగ్రీల సెల్సియస్‌ దాటితేనే కాలు బయటపెట్టకుండా ఇంట్లో ఏసీ వేసుకొని ఉంటాం. కానీ, కొందరు మాత్రం 50 డిగ్రీల సెల్సియస్‌ దాటితే వేడి ఎలా ఉంటుందో అనుభవించాలనుకొని కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీకి బారులు తీరుతున్నారు. అక్కడి నేషనల్‌ పార్క్‌ యాజమాన్యం వద్దని చెబుతున్నా వినడం లేదు.

వెర్రి వెయ్యి రకాలన్నట్లు.. మలమలా మాడ్చే ఎండ ఎలా ఉంటుందో చూద్దామనుకొని జనాలు ఆ ప్రదేశానికి బారులు తీరుతున్నారు. మనం ఎండ 40 డిగ్రీల సెల్సియస్‌ దాటితేనే కాలు బయటపెట్టకుండా ఇంట్లో ఏసీ వేసుకొని ఉంటాం. కానీ, కొందరు మాత్రం 50 డిగ్రీల సెల్సియస్‌ దాటితే వేడి ఎలా ఉంటుందో అనుభవించాలనుకొని కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీకి బారులు తీరుతున్నారు. అక్కడి నేషనల్‌ పార్క్‌ యాజమాన్యం వద్దని చెబుతున్నా వినడం లేదు. తాజాగా ఓ బైక్‌ రైడర్‌ వేడి దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోయాడు. అయినా పర్యాటకులు మాత్రం ఆగడం లేదు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్‌వ్యాలీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే ప్రాంతం. ఇక్కడ అసాధారణ ఉష్ణోగ్రతలకు భౌగోళిక పరిస్థితులు కూడా కారణమే. ఇక్కడ 1913లో జులై 10వ తేదీన అత్యధికంగా 56.66 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. కాకపోతే ఇది సరికాదనే వివాదం కూడా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత గణాంకాలు చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ఫర్నేస్‌ క్రీక్‌ అనే ప్రాంతంలో భీకరమైన వేడి ఉంటుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాలు.

సర్కారీ పథకం డబ్బు తీసుకున్నారు.. భర్తలను వదిలేసి లవర్స్‌తో జంప్ అయిన భార్యలు

వామ్మో.. దేవుడో.. 16 కీటకాలు తినేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సంస్కారం మరచిన యూట్యూబర్‌కి.. సర్కారు చెంప దెబ్బ

ఆయన తలపై గురిపెట్టుకున్న గన్స్‌ వేలం.. రూ. 15 కోట్లకు కొనుక్కున్న అజ్ఞాత వాసి