caterpillar Video: అరె..ఈ పురుగు 13 రూపాలుగా మారుతుందట..! ఇతర జీవులను భయపెట్టడానికి టోపీలా 5 తలలు.. వీడియో వైరల్..

Updated on: Nov 11, 2021 | 8:54 AM

సాధారణంగా ఏ జీవికైనా ఒక్క తల మాత్రమే ఉంటుంది. ఒక్కోసారి జన్యుపరంగా ఏదైనా లోపాలు ఉంటే రెండు, తలలు మూడు తలలతో కొన్ని జంతువులు పుట్టడం మనం చూశాం. కానీ ఒక్క గొంగలి పురుగుకు మాత్రం 5 తలలు సహజంగా ఉంటాయన్న సంగతి మీకు తెలుసా...


సాధారణంగా ఏ జీవికైనా ఒక్క తల మాత్రమే ఉంటుంది. ఒక్కోసారి జన్యుపరంగా ఏదైనా లోపాలు ఉంటే రెండు, తలలు మూడు తలలతో కొన్ని జంతువులు పుట్టడం మనం చూశాం. కానీ ఒక్క గొంగలి పురుగుకు మాత్రం 5 తలలు సహజంగా ఉంటాయన్న సంగతి మీకు తెలుసా… అందరూ అనుకున్నట్లు గొంగళి పురుగుకు ఒక తల కాదు, ఐదు తలలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే వాటిని ఉంచుకుంటాయి. చాలావరకు వాటిని వదిలేస్తుంటాయి. ఎందుకంటే అవి చనిపోయిన తలలు కాబట్టి. గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలుకగా మారుతుందనే విషయం తెలిసిందే. అలా రూపాంతరం చెందే ముందు మరో పదమూడు రూపాంతరాలు చెందుతుందట ఈ గొంగలి పురుగు.

ఇలా ఈ రూపాంతరం చెందే ప్రతిసారి వాటి పాత చర్మాన్ని వదిలి.. కొత్త చర్మాన్ని ధరిస్తాయి. ఈ క్రమంలోనే వాటి తల భాగం కూడా మారుతుంది. మారే తలను కొన్ని గొంగళి పురుగులు ఓ టోపీలా వాటి తలపైనే పెట్టుకుంటే, కొన్ని వదిలేస్తుంటాయట. అలా సుమారు ఐదు తలల వరకు ధరిస్తాయట. ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన ఉరాబా లూజెన్స్‌ జాతికి చెందిన గొంగళి పురుగులు ఇలా చేస్తాయట. వీటిని ‘మ్యాడ్‌ హాటర్‌పిల్లర్‌’ అని పిలుస్తారట. ఇతర జీవుల నుంచి తమని తాము పెద్దదిగా చూపించుకుంటూ భయపెట్టడానికి కొన్ని గొంగలిపురుగులు ఈ తలల టోపీని ధరిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Published on: Nov 11, 2021 08:07 AM