Viral Video: జపనీస్ నోట జనగణమన.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. భారత ఖ్యాతి అలాంటిది..
ఏదైనా దేశానికి స్వాతంత్య్ర దినోత్సవం లేదా.. ముఖ్యమైన వేడుకల సమయంలో ఇతర దేశాలు శుభాకాంక్షలు తెలియజేయడం సర్వసాధారణం. ఆ దేశానికి, భారత్ కు ఉన్న అనుబంధాన్ని
ఏదైనా దేశానికి స్వాతంత్య్ర దినోత్సవం లేదా.. ముఖ్యమైన వేడుకల సమయంలో ఇతర దేశాలు శుభాకాంక్షలు తెలియజేయడం సర్వసాధారణం. ఆ దేశానికి, భారత్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం, భారత నాయకత్వాన్ని అభినందించడం సాధారణంగా చూస్తుంటాం.. కాని భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయం అధికారులు, సిబ్బంది వినూత్నంగా ఆలోచించి.. ఓ వీడియో రూపంలో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఈవీడియోలో ఏముందనుకుంటున్నారా..భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయంలో సిబ్బంది జనగనమణ పాడుతూ.. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. భారత్, జపాన్ కు చెందిన ఇరు దేశాల వాళ్లు.. సంగీత వాయిద్యాలతో సంగీతం వాయిస్తుండగా.. జనగనమణ గీతాన్ని ఆలపించారు. తొలుత భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయ అధికారి సందేశంతో ప్రారంభమయ్యే వీడియో.. జనగనమణ గీతాన్ని ఆలపించి.. ఆతర్వాత హ్యాపీ ఇండిపెండెంట్స్ డే అని నినదించడంతో ముగుస్తుంది. ఈవీడియో జపాన్ రాయబార కార్యాలయ సిబ్బంది అంతా భారత జాతీయ జెండాను చేతితో పట్టుకుని జనగనమణ ఆలపించడం విశేషం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..