Sinwar Old Video: భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..

|

Oct 25, 2024 | 8:42 PM

సిన్వర్‌, అతడి భార్య, పిల్లలు కలిసి పలు వస్తువులను పట్టుకుని సొరంగంలోకి ప్రవేశిస్తున్నట్లు వీడియలో కనిపిస్తోంది. ఇది అతడి ఇంటి కింద ఏర్పాటు చేసుకున్న సొరంగం అని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రతినిధి డానియల్ హగేరీ తెలిపారు. గత ఏడాది దాడులు జరిగినప్పటి నుంచి సిన్వర్ ఈ సొరంగంలోనే ఎక్కువ సమయం గడిపినట్లు చెప్పారు. అక్కడ వారు ఏర్పాటుచేసుకున్న సౌకర్యాలతో పాటు దళాల తనిఖీల్లో దొరికిన క్యాష్‌, పత్రాలకు సంబంధించిన ఫొటోలను విలేకరుల సమావేశంలో హగేరీ చూపించారు. ఇజ్రాయెల్‌ […]

సిన్వర్‌, అతడి భార్య, పిల్లలు కలిసి పలు వస్తువులను పట్టుకుని సొరంగంలోకి ప్రవేశిస్తున్నట్లు వీడియలో కనిపిస్తోంది. ఇది అతడి ఇంటి కింద ఏర్పాటు చేసుకున్న సొరంగం అని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రతినిధి డానియల్ హగేరీ తెలిపారు. గత ఏడాది దాడులు జరిగినప్పటి నుంచి సిన్వర్ ఈ సొరంగంలోనే ఎక్కువ సమయం గడిపినట్లు చెప్పారు. అక్కడ వారు ఏర్పాటుచేసుకున్న సౌకర్యాలతో పాటు దళాల తనిఖీల్లో దొరికిన క్యాష్‌, పత్రాలకు సంబంధించిన ఫొటోలను విలేకరుల సమావేశంలో హగేరీ చూపించారు.

ఇజ్రాయెల్‌ విడుదల చేసిన వీడియోలో సిన్వర్‌ భార్య చేతిలో ఓ హ్యాండ్ బ్యాగ్‌ ఉంది. దీని విలువ 32,000 డాలర్లు. అంటే రూ.26 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐడీఎఫ్‌ అధికారి అవిచాయ్‌ అడ్రే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గాజా ప్రాంతంలోని ప్రజలు కనీస అవసరాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు కానీ, సిన్వర్‌, అతడి భార్యకు డబ్బుపై ఉన్న ప్రేమకు ఇది ఒక ఉదాహరణ అని ఆయన విమర్శించారు.

గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. ఆ ఘటనలో 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 250 మందిని హమాస్.. బందీలుగా తీసుకెళ్లింది. దీంతో ఈ దాడులకు సూత్రధారి అయిన సిన్వర్‌ను హతమర్చాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిన్వర్ మృతి చెందాడు. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతి చెందింది హమాస్ అధినేతేనని ఇజ్రాయెల్ నిర్థారించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.