Israel-Hamas war: నామరూపాల్లేకుండా పోయిన గాజా నగరాలు.. శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు.!

|

Sep 16, 2024 | 8:46 AM

గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన మెరుపు దాడికి ప్రతిస్పందనగా గాజా నగరాలపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంతో గాజా నగరాలు నామరూపాల్లేకుండా పోయాయి. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు దాదాపు 80వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటిని పునర్నిర్మించాలంటే బిలియన్‌ డాలర్లు అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన మెరుపు దాడిలో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 41 వేలకుపైగా పాలస్తీనీయన్లు చనిపోగా.. 95 వేల మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో 10 వేల మృతదేహాలు ఉండొచ్చని అంచనా.

ఈ యుద్ధంలో గాజాలో 80 వేల ఇళ్లు ధ్వంసమైనట్లు గాజా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 18.5 బిలియన్‌ డాలర్ల అంటే రూ.1.53లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. 4 కోట్ల టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వీటిని తొలగించేందుకే 15 ఏళ్ల సమయం పట్టడంతోపాటు 50- 60 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని లెక్కకట్టింది. సమితి నివేదిక ప్రకారం దాదాపు 19 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గాజా పునర్నిర్మాణానికి 2040వ ఏడాది వరకు లేదా మరిన్ని దశాబ్దాల సమయం పడుతుందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on