గాజా యుద్ధ విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన PM మోదీ
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఈ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థ నాయకత్వానికి నిదర్శనమన్నారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సాయం, శాశ్వత శాంతిని మోదీ ఆకాంక్షించారు. ఈ ఒప్పందం ద్వారా గాజాలోని మెజారిటీ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగనున్నాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ శాంతి ప్రణాళిక ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులు సంతకాలు చేశారని ఆయన వెల్లడించారు. ఈ కీలక పరిణామాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శనమని పీఎం మోదీ ప్రశంసించారు. ఈ ఒప్పందం అమలుతో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారందరూ త్వరలోనే సురక్షితంగా విడుదలవుతారని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. గాజా ప్రాంత ప్రజలకు మెరుగైన మానవతా సాయం నిరాటంకంగా అందుతుందని, ఇది దీర్ఘకాలిక శాంతి స్థాపనకు బలమైన పునాది వేస్తుందని ఆయన తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్‌కు అమెరికా సెనేటర్ల లేఖ.. భారత్‌తో బంధం పెంచుకోవాలని సూచన
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన
శ్రీరాముడిని గుర్తు చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్.. విల్లు-బాణం ఫోజు పెట్టి సెంచరీ సెలబ్రేషన్
గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్.. స్పెషల్ లుక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
