Madhura Naik: నా అక్కను ఆమె పిల్లల ముందే చంపేశారు.! నాగిని సీరియల్ నటి ఎమోషనల్‌..!

Updated on: Oct 14, 2023 | 4:21 PM

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ దాడిలో తన సోదరి, ఆమె భర్తను దారుణంగా చంపేశారంటూ టీవీ నటి మధురా నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడిలో చాలా మంది బంధువులను కోల్పోయానని వీడియోలో మధురా అన్నారు. వారందరి ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుంటాయి. అక్టోబర్‌7న జరిగిన దాడిలో తన సోదరిని

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ దాడిలో తన సోదరి, ఆమె భర్తను దారుణంగా చంపేశారంటూ టీవీ నటి మధురా నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడిలో చాలా మంది బంధువులను కోల్పోయానని వీడియోలో మధురా అన్నారు. వారందరి ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుంటాయి. అక్టోబర్‌7న జరిగిన దాడిలో తన సోదరిని, ఆమె భర్తను వారి పిల్లల ముందే దారుణంగా చంపేశారనీ ఇజ్రాయెల్‌లో ఉన్న బాధితులందరి కోసం తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల అరాచకాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారనీ పట్టపగలే మహిళలను, పిల్లలను, వృద్ధులను చంపేస్తున్నారనీ ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్‌ ప్రజలకు అండగా నిలవండి అని ఆమె కోరారు. బాధిత కుటుంబాల కోసం దయచేసి అందరూ ప్రార్థించండి అంటూ ఎమోషనల్‌ వీడియో పోస్ట్‌ చేశారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన తన సోదరి కుటుంబసభ్యుల ఫొటోలను కూడా మరో పోస్టులో షేర్‌ చేశారు. మధురా నాయక్ బాలీవుడ్‌లోని నాగిని సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. హైఫా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌ వెళ్లి అక్కడ చిక్కుకున్న బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా సురక్షితంగా భారత్‌కు తిరిగొచ్చారు. అక్కడ ఆమెకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..