Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్‌.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు

Updated on: Oct 06, 2025 | 9:24 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరంపై మంచు తుపాను బీభత్సం సృష్టించింది. వేల అడుగుల ఎత్తులో దాదాపు 1000 మంది పర్వతారోహకులు మంచు తుపానులో చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు, ప్రతికూల పరిస్థితుల్లోనూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

ఇప్పటివరకు సుమారు 350 మందిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చి, క్యుడాంగ్ పట్టణానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే, భారీగా మంచు చరియలు విరిగిపడటంతో మార్గాలన్నీ పూర్తిగా మూసుకుపోయాయి. వాటిని తొలగించేందుకు వందలాది మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. టిబెట్ వైపున ఉన్న ఎవరెస్ట్ తూర్పు వాలుపై శుక్రవారం సాయంత్రం మొదలైన హిమపాతం, ఆదివారం నాటికి భీకరమైన మంచు తుపానుగా మారిపోయింది. ప్రస్తుతం చైనాలో జాతీయ సెలవులు కొనసాగుతుండటంతో, ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు, హైకర్లు అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో తుపాను విరుచుకుపడటంతో వారంతా వివిధ క్యాంప్ సైట్లలో చిక్కుకుపోయినట్లు తెలిసింది. పర్వతంపై చిక్కుకున్న వారు తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే హైపోథెర్మియా బారిన పడినట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు, శనివారం నుంచే ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు కొత్తగా అనుమతులు ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణంగా అక్టోబర్ నెలలో ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US Army Beard Ban: సైనికులు గడ్డాలు పెంచుకోవడంపై నిషేధం

Rohit Sharma: రోహిత్‌ శర్మకు ఊహించని షాక్

New Traffic Rules: వాహనదారులకు ఇక దబిడి దిబిడే.. కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ ఇవే!

స్పేస్‌ డెలివరీ వెహికిల్‌ రెడీ.. గంటలో ప్రపంచంలో ఏ మూలకైనా సరుకు రవాణా

ఊగిపోయిన భవనాలు.. జనం పరుగో పరుగు