ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్‌.. అమెరికాపై దాడులకు కుట్ర ??

Updated on: Mar 11, 2026 | 12:52 PM

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ప్రతీకారం తీర్చుకోవడానికి స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసింది. విదేశాల్లో దాడులకు ప్లాన్ చేయగా, అమెరికా నిఘా వర్గాలు ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్‌ను గుర్తించి, వాటిని విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇరాన్ ప్రతీకార చర్యల ప్రయత్నాలు విఫలమయ్యాయి.

తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో ఇరాన్ కోపంతో రగిలిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది. స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌పై బాంబు దాడులు చేసాయి. ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్‌లో మొత్తం 30 చోట్ల బాంబుల వర్షం కురిపించాయి. దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు భార్య, కోడలు, మనవడు చనిపోయారు. ఇరాన్‌కు చెందిన ఇతర కీలక నేతలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురైంది. శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. ఓ అమెరికా మీడియా కథనం ప్రకారం.. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసింది. విదేశాల్లో ఉన్న ఇరాన్ స్లీపర్ సెల్స్ దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్‌ను అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గుర్తించాయి. నిఘా వర్గాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ప్రాథమిక ఎనాలసిస్‌లో సిగ్నల్స్ ఇరాన్‌ నుంచే వచ్చినట్లు తేలింది. సాధారణానికి భిన్నంగా, ఈ సిగ్నల్స్ పలు దేశాల ద్వారా రీ-బ్రాడ్‌కాస్ట్ కావడం.. రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లను నిరంతరం పర్యవేక్షించే విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఎన్‌క్రిప్టెడ్ భాషలో ఉన్న ఆ మెసేజ్‌‌లను చదవటం అంత సులభం కాదు. డిక్రిప్షన్ కీ ఉన్న వారు మాత్రమే వాటిని చదవగలరు. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా, డిజిటల్ ఆధారాలు దొరకకుండా సిగ్నల్స్ పంపడానికి ఇటువంటి కమ్యూనికేషన్ పద్ధతులను సాధారణంగా నిఘా సంస్థలు, ఉగ్రవాద ముఠాలు ఉపయోగిస్తుంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు

కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!

భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా

హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు

దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం

Follow Us