Iran-US peace talks: అమెరికా Vs ఇరాన్.. పాక్ వేదికగా శాంతి మంత్రం.. ఎవరి డిమాండ్లు నెగ్గుతాయి ??

Updated on: Apr 11, 2026 | 7:32 PM

పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అన్వస్త్రాల తయారీ, ఆర్థిక సహకారం, లెబనాన్ వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కష్టంగా ఉంది. తొలుత విడివిడిగా, అనంతరం ఉమ్మడిగా పాక్ ప్రధాని సమక్షంలో జరిగే ఈ చర్చలు విడతలవారీగా కొనసాగనున్నాయి. ఈ సాయంత్రం తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యాయి. శాశ్వత శాంతిని ఆశించినప్పటికీ, ఇరు దేశాల మధ్య పలు అంశాలపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ప్రధానంగా అన్వస్త్రాల తయారీపై అమెరికా షరతులను ఇరాన్ వ్యతిరేకిస్తుండగా, ఆర్థిక సహకారం, లెబనాన్ ఇష్యూపై ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా అంగీకరించడం లేదు. ఈ చర్చలు ఒకే రోజుతో ముగిసిపోయేవి కాదని, విడతలవారీగా కొనసాగుతాయని తెలుస్తోంది. తొలుత ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో భేటీ కాగా, ఆ తర్వాత అమెరికా ప్రతినిధి బృందం కూడా షరీఫ్‌తో సమావేశమవుతుంది. అనంతరం రెండు దేశాల ప్రతినిధులు పాక్ ప్రధాని సమక్షంలో ఉమ్మడిగా చర్చలు జరుపుతారు. ఇరాన్ నుంచి ఆ దేశ స్పీకర్, విదేశాంగ మంత్రి, అమెరికా నుంచి జేడీ వ్యాన్స్, ట్రంప్ బృందం పాల్గొంటున్నారు. భద్రతా కారణాల వల్ల జేడీ వ్యాన్స్ రాక ఆలస్యం కాగా, ప్రస్తుతం ఆయన ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. చర్చల తొలి ఫలితం ఈ సాయంత్రం వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మావిగన్ అంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు

ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

RTC Bus Drivers: బస్సు డ్రైవర్లు అంటే అంత చులకనా… ఇంకెంత కాలం బలి అవ్వాలి ?

దేవుడా.. అన్నదాతల కష్టాలు చూస్తున్నవా ?? పొలానికి ట్యాంకర్‌ నీళ్లే దిక్కు

ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్‌.. ఎక్కడో తెలుసా ??

Loading...
Unable to load recommendations.
Follow Us