ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా

Updated on: Feb 10, 2026 | 6:31 PM

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' పాక్ వైమానిక స్థావరాలపై తీవ్ర ప్రభావం చూపింది. భోలారి, మురీద్ వంటి కీలక ఎయిర్‌బేస్‌లకు జరిగిన భారీ నష్టం శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది. దెబ్బతిన్న హ్యాంగర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లను పాక్ పునర్నిర్మిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విధ్వంసం పాక్ వైమానిక దళానికి దీర్ఘకాలిక నష్టాన్ని కలిగించింది.

పహల్గాం టెర్రర్ అటాక్‎కు ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గాయాల నుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. భారత బలగాలు చేసిన ప్రతిదాడుల్లో పాక్‎లోని ఎయిర్ బేస్‎లు ధ్వంసమయ్యాయి. అందులో భోలారి ఎయిర్ బేస్ కూడా ఒకటి. భోలారి ఎయిర్‌బేస్‌లోని హ్యాంగర్‎కు భారీగా నష్టం జరిగింది. ఆ హ్యాంగర్‎కు పాకిస్తాన్ రిపేర్లు చేస్తున్న ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హ్యాంగర్ రూఫ్‎ను పూర్తిగా తొలగించి దానిపై టార్పాలిన్ కప్పారు. శాటిలైట్లు కొన్ని ఆ హ్యాంగర్ ఫొటోలు తీశాయి. దీంతో హ్యాంగర్‎ను పాక్ ఎయిర్ ఫోర్స్ పునర్నిర్మిస్తున్నట్లు తెలిసింది. డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని టార్పాలిన్‎తో కప్పినా ధ్వంసమైన భాగం ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, స్ట్రాబ్ 2000 విమానాన్ని కూడా భారత బలగాలు ధ్వంసం చేశాయి. డ్యామేజ్ అయిన ఇతర ఎయిర్ బేస్‎లలో కూడా రీకన్ స్ట్రక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ధ్వంసమైన భాగాలను తొలగించి కొత్త రూఫ్‎లు నిర్మిస్తున్నారు. శకలాలను పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. సుక్కూర్‎లోని మురీద్ ఎయిర్ బేస్ కూడా భారత బలగాల దాడిలో తీవ్రంగా దెబ్బతింది. అక్కడ కూడా రిపేర్ పనులు జరుగుతున్న దృశ్యాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దెబ్బతిన్న రూఫ్ బిల్డింగ్‎ను ఎర్రటి టార్పాలిన్ తో కప్పారు. కీలక నూర్ ఖాన్ ఎయిర్ బేస్‎లోని కమాండ్ కంట్రోల్ కూడా డ్యామేజ్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. ఆత్మహత్యా ?? లేక హత్యా ??

పాక్ కు షాకిచ్చిన ట్రంప్ టీమ్‌ పీఓకేతో భారత మ్యాప్‌ సిద్ధం

పూనకంతో ఊగిపోతూ.. 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగిన నటి

బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హై అలర్ట్

అంగన్‌వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్