బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా VHP ఆందోళన

Updated on: Dec 23, 2025 | 6:54 PM

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP) దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీపు చంద్రదాస్ హత్యకు నిరసనగా పలు నగరాల్లో ఆందోళనలు జరిగాయి. బాధితులకు న్యాయం చేయాలని, భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP) కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. VHP కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్ హత్యతో సహా హిందువులపై జరిగిన దారుణాలను నిరసిస్తూ VHP, ఇతర హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లలో నిరసనలు చేపట్టారు. జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పించాలని, భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని కొత్తపేట చౌరస్తాలో బంగ్లాదేశ్ జిహాదీల దిష్టిబొమ్మను దహనం చేశారు. పొరుగు దేశంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు

CM Chandrababu Naidu: కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే ??

Weather Report: చలి పంజా.. వణుకుతున్న తెలంగాణ

Peddi: పెద్దితో పోటీ.. అంత ఈజీ కాదు