Viral Video: ఇదేంటి… ఈ ఇల్లు గిరగిరా తిరుగుతోంది? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

Oct 16, 2021 | 8:01 AM

ప్రేమకు చిహ్నం ఏంటంటే.. వెంటనే షాజహాన్‌ తన భార్య కోసం కట్టించిన తాజ్‌మహల్‌ గుర్తొస్తుంది ఎవరికైనా.. ఐతే తరతరాలుగా ఎందరో తమకు ఇష్టమైన వారికోసం ఎన్నో కట్టించారు. కానీ అవన్నీ అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.

ప్రేమకు చిహ్నం ఏంటంటే.. వెంటనే షాజహాన్‌ తన భార్య కోసం కట్టించిన తాజ్‌మహల్‌ గుర్తొస్తుంది ఎవరికైనా.. ఐతే తరతరాలుగా ఎందరో తమకు ఇష్టమైన వారికోసం ఎన్నో కట్టించారు. కానీ అవన్నీ అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. తాజాగా ఉత్తర బోస్నియాకు చెందిన 72 యేళ్ల వ్యక్తి భార్య ​కోసం రొటేటింగ్‌ హౌస్‌ను నిర్మించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇల్లు మొత్తం చక్కని ఆకుపచ్చ రంగుతో, రెడ్‌ మెటల్‌ రూఫ్‌తో 360 డిగ్రీల యాంగిల్‌లో తిరిగే ఈ రొటేటింగ్‌ హౌస్‌ను వోజిన్‌ కుసిక్‌ అనే వ్యక్తి, తన భార్య లుబికా కోసం నిర్మించాడు. కాలేజీ చదువుకూడా లేని కుసిక్ ఈ రొటేట్‌ హౌస్‌ను స్వయంగా డిజైన్‌ చేశాడట. కేవలం ఎలక్ట్రిక్ మోటార్లు, పాత మిలిటరీ రవాణా వాహన చక్రాలను ఉపయోగించి కట్టాడని అక్కడి స్థానిక మీడియాకు వెల్లడించాడు. జీవిత చరమాంకానికి చేరుకున్న తర్వాత, పిల్లలు కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఇన్నేళ్లకి నా భార్య కోరిక తీర్చడానికి సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: IPL 2021 Final: తెలుగులో అదరగొట్టిన కోల్‌కతా ప్లేయర్.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Water Purification: ప్రపంచ వ్యాప్తంగా పంచినీటి కొరత తీరుతుందంటున్న శాస్త్రవేత్తలు.. ఒక్క టాబ్లెట్‌తో స్వచ్ఛమైన నీరు..(వీడియో)