అమెరికా గ్రీన్ కార్డు .. 2028 వరకు భారతీయులకు ఛాన్సే లేదు

Updated on: Oct 19, 2025 | 10:30 AM

అమెరికాలో గ్రీన్‌ కార్డ్‌ ఆశించే వేలాది మంది భారతీయులకు నిరాశే ఎదురైంది. డైవర్సిటీ వీసా లాటరీ కార్యక్రమం నుంచి అమెరికా భారత్‌ను మినహాయించింది. అమెరికాకు వలస వెళ్తున్న భారతీయుల సంఖ్య భారీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన కనీసం 2028 వరకు కొనసాగనుంది. అమెరికా వలస జనాభాలో వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు డైవర్సిటీ లాటరీ నిర్వహిస్తారు.

గత ఐదేళ్లలో ఏ దేశం నుంచైనా 50,000 కంటే తక్కువ మంది అమెరికాకు వలస వచ్చి ఉంటే, ఆ దేశ పౌరులు మాత్రమే ఈ లాటరీకి అర్హులు. భారత్ నుంచి అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య ఈ పరిమితిని ఎప్పుడో దాటేసింది. దీంతో భారతీయులు ఆటోమేటిక్‌గా ఈ లాటరీకి అనర్హులుగా మారారు. అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2021లో 93 వేల మంది, 2022లో లక్షా 27 వేల మంది, 2023లో 78 వేల మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. ముఖ్యంగా 2022లో ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం వలసదారుల కంటే భారతీయుల సంఖ్యే ఎక్కువ. ఈ అధిక సంఖ్య కారణంగానే 2028 వరకు డీవీ లాటరీ జాబితాలో భారత్‌కు చోటు దక్కలేదు. భారత్‌తో పాటు చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్ కూడా 2026 డీవీ లాటరీకి అనర్హుల జాబితాలో ఉన్నాయి. ఈ లాటరీ మార్గం మూసుకుపోవడంతో హెచ్-1బీ వీసాను శాశ్వత నివాసంగా మార్చుకోవడం, పెట్టుబడుల ఆధారిత వలస, కుటుంబ స్పాన్సర్‌షిప్ వంటి పరిమిత మార్గాలు మాత్రమే భారతీయులకు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.3 కోట్ల బెంజ్ కారు కొన్న రైతు.. ధోతీ కట్టుకొని వచ్చి ..

హైదరాబాద్ వాసికి రష్యాలో నరకం.. బలవంతంగా యుద్ధ రంగం లోకి