Boyfriend in Suitcase: బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.! వీడియో..

|

Nov 02, 2024 | 6:17 PM

నాలుగేళ్ల క్రితం సూట్‌కేసులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి చనిపోయి కనిపించాడు. పోలీసులకు ఫోన్‌ చేసిన అతని గర్ల్ ఫ్రెండ్‌ మద్యం మత్తులో ఆడిన ఆటలో భాగంగా అతన్ని సూట్‌కేస్‌లో బంధించినట్లు చెప్పింది. అతనే బయటికొస్తాడని తాను అనుకున్నట్లు కూడా చెప్పింది. తనకు నిద్ర ముంచుకొచ్చిందని నిద్రపోయాక తిరిగి వచ్చి చూడగా అతను ఇంకా సూట్‌కేసులో ఉన్నట్లు తెలిపింది.

కొన్ని గంటలపాటు బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన అమెరికాలో ఫ్లోరిడాలోని మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్‌పార్క్‌ అపార్ట్‌మెంట్‌లో సారా బూన్, బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌ టోరెస్‌తో కలిసి ఉంటోంది. 2020లో టోరెస్‌ ఓ సూట్‌కేస్‌లో శవమై కనిపించాడు. సారా బూన్‌ను అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. ఆ సమయంలో తామిద్దరం మద్యం తాగి ఉన్నట్లు ఆమె చెప్పింది. ఆటలో భాగంగా అతను సూట్‌కేసులో దాక్కున్నాడనీ అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్‌ తీసుకోగలడని భావించినట్లు చెప్పింది. తాను మేడపైకి వెళ్లి పడుకున్నానని చెప్పింది. కానీ తాను నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్‌కేసులోనే ఉన్నాడనీ అప్పటికే అతని ఊపిరి ఆగిపోయిందని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్‌ ఫోనే ఆమెను పట్టించింది.

తనను సూట్‌కేసులోంచి తీయాలని టోరెస్‌ వేడుకుంటుండగా, తాను నవ్విన దృశ్యాలను బూన్‌ తన ఫోన్‌లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్‌ బతిమాలుతుండగా.. అతనికి దక్కాల్సింది అదేననీ తనను మోసం చేసినప్పుడు తనకు కూడా అలాగే అనిపించిందనీ అంది. తను కూడా గతంలో అతని హింసాత్మక చర్యల వల్ల ఊపిరి పీల్చుకోలేకపోయాననీ సారా బూన్‌ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్‌లో శిక్ష ఖరారు చేయనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.