India-USA Military Video: అలరించిన భారత్‌-అమెరికా సైన్యం యుద్ధ విన్యాసాలు.. అదరగొట్టిన జవాన్లు.. (వీడియో)

|

Oct 24, 2021 | 8:34 AM

భారత్‌-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్నాయి. అక్టోబర్‌ 15 నుంచి 29వరకు దాదాపు 14 రోజుల పాటు ఈ విన్యాసాలు జరుగుతాయి. ఈ సంయుక్త విన్యాసాల్లో..

India-USA Military Video: భారత్‌-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్నాయి. అక్టోబర్‌ 15 నుంచి 29వరకు దాదాపు 14 రోజుల పాటు ఈ విన్యాసాలు జరుగుతాయి. ఈ సంయుక్త విన్యాసాల్లో భారత ఆర్మీ తరపున 350 మంది జవాన్లు పాల్గొంటున్నారు. ఇక అమెరికా నుంచి 300 మంది సైనికులు హాజరవుతున్నారు. అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు… భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటోంది.

ఈ క్రమంలో అక్టోబరు 16న ఇరు దేశాల సైనికులు కలిసి రెండు జట్లుగా ఏర్పడి కబడ్డీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. అమెరికన్‌ సైన్యం మన కబడ్డీ కూతతో మోత మోగించగా.. భారత జవాన్లు ఫుట్‌బాల్‌ పోటీలో గోల్స్‌ మీద గోల్స్‌ చేశారు.. ఈ స్నేహపూర్వకంగా సాగిన ఈ ఆటల్లో రెండు దేశాల సైన్యాలు… నాలుగు మిశ్రమ జట్లుగా ఏర్పడి పోటీ పడి.. మరీ క్రీడా స్ఫూర్తిని చాటారు. ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు మంచును విసురుకుంటూ ఎంజాయ్‌ చేశారు.. భారత్‌-అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. ఇరుదేశాల సైన్యం ఒకరినినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడినట్లు సైనికాధికారులు తెలిపారు. భారత్‌- అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వ సారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహన, పరస్పర సహకారం పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. కాగా భారత్-అమెరికా సైన్యాల 16వ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికానేర్‌లో జరిగాయి.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Bathroom birth: టాయిలెట్‌కి వెళ్లి బిడ్డతో బయటకు వచ్చిన మహిళ.. బాత్రూంలోనే ప్రసవం.. వైరల్ అవుతున్న వీడియో.

Europe Airport: విమానాలను రక్షించుకోడానికి పందుల సాయం..! ఆమ్‌స్టర్‌డామ్‌ స్కిఫోల్‌ ఎయిర్‌పోర్టు.. (వీడియో)