Bathroom birth: టాయిలెట్‌కి వెళ్లి బిడ్డతో బయటకు వచ్చిన మహిళ.. బాత్రూంలోనే ప్రసవం.. వైరల్ అవుతున్న వీడియో.
ప్రసవకోసం ఆస్పత్రికి వెళ్తూ మార్గ మధ్యంలోనే డెలివరీ అయిన సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఒక్కోసారి అనుకోకుండా సమయం కాకముందే ప్రసవం జరిగిపోతుంటుంది. అలా సరదాగా భర్తతో కలిసి బయటకు వెళ్లిన ఓ మహిళకు అనుకోకుండా డెలివరీ అయిపోయింది.
ప్రసవకోసం ఆస్పత్రికి వెళ్తూ మార్గ మధ్యంలోనే డెలివరీ అయిన సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఒక్కోసారి అనుకోకుండా సమయం కాకముందే ప్రసవం జరిగిపోతుంటుంది. అలా సరదాగా భర్తతో కలిసి బయటకు వెళ్లిన ఓ మహిళకు అనుకోకుండా డెలివరీ అయిపోయింది. యూకేకి చెందిన కైట్లిన్ ఫుల్లెర్టన్, సెర్గియో అనే దంపతులు కారులో సరదాగా బయటకు వెళ్లారు. అయితే అనుకోకుండా కైట్లిన్ టాయిలెట్‌కి వెళ్లాల్సివచ్చింది. సమీపంలో ఎలాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లోని బాత్‌రూంలోకి వెళ్లింది. అనుకోకుండా ఆమెకు నొప్పులు మొదలై కేవలం 10 నిమిషాల్లోనే ప్రసవం అయిపోయింది. అంతేకాదు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా ఏం చేయాలో తోచలేదు. అక్కడే ఉన్న కొంత మంది మహిళల సాయంతో విషయం తన భర్తకు తెలియజేయడంతో వెంటనే కైట్లిన్ భర్త సెర్గియో వస్తాడు. ఆ తర్వాత ఆమె భర్త సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తల్లి బిడ్డలు సురక్షింతంగానే ఉన్నారని వైద్యులు చెప్పడంతో దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనుకోకుండా జరిగే ఇలాంటి సంఘటనలు భయం కలిగిస్తాయి కదా.. అందుకే గర్భిణిలు బయటకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Intrusting Video: వందేళ్లయినా.. ఈమెకు వృద్ధాప్యం రాదు.. ఎందుకో తెలుసా.. (వీడియో )
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

