Elon Musk: ఎలన్ మస్క్ కుమారుడి పేరు శేఖర్
నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో ఎలన్ మస్క్ కీలక విషయాలు వెల్లడించారు. తన భాగస్వామి శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయని, ఆమె తల్లి పంజాబీ అని తెలిపారు. వారి కుమారుల్లో ఒకరి పేరు 'శేఖర్' అని, నోబెల్ గ్రహీత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ పేరు స్ఫూర్తిగా పెట్టినట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణురాలైన శివోన్.. మస్క్ కంపెనీ న్యూరాలింక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తన సహచరికి భారతీయ మూలాలు ఉన్నాయని ఎలన్ మస్క్ ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. తమ కుమారుల్లో ఒకరి పేరు శేఖర్ అని చెప్పారు. జెరోధాకు చెందిన నిఖిల్ కామత్ నిర్వహించిన ‘పాడ్‌కాస్ట్’లో పాల్గొన్న మస్క్ కీలక విషయాలను పంచుకున్నారు. తనకూ శివోన్ జిలిస్‌కు (Shivon Zilis) పుట్టిన కుమారుల్లో ఒకరికి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టామనీ.. భారతీయమూలాలున్న అమెరికన్ అయిన భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ పేరులో నుంచి శేఖర్‌ను తీసుకున్నట్లు చెప్పారు. సహచరి శివోన్ సగం భారతీయురాలు.. ఆమె తల్లి పంజాబీ, శివోన్ చిన్నతనంలో ఆమెను వేరే కుటుంబం దత్తత తీసుకుంది. శివోన్ అలా కెనడాలో పెరిగింది అని చెప్పారు. శివోన్ జిలిస్ (Shivon Zilis) ఎక్కడ పెరిగిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆమె పూర్వీకులు భారతీయులు. శిశువుగా ఉన్నప్పుడే దత్తత ఇచ్చారు. తనకు కచ్చితమైన వివరాలు తెలియకపోయినా.. శిశువుగా ఉన్నప్పుడు మాత్రం దత్తత ఇచ్చారు. అనంతరం కెనడాలో పెరిగింది. అలా ఆమె ఇండియన్-అమెరికన్ అయిందని ఎలన్ మస్క్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ అయిన శివోన్ .. 2017లో మస్క్‌కు చెందిన ఏఐ కంపెనీ న్యూరాలింక్‌లో చేరారు. ప్రస్తుతం ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తు్న్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్స్ట్ పట్టా పొందారు. ఆ సమయంలో ఆమె ఐస్ హాకీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. అనంతరం ఐబీఎం, బ్లూమ్‌బర్గ్‌లో పనిచేశారు. 2016లో ఓపెన్‌ఏఐలో చేరారు. శివోన్-మస్క్ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు. 2021లో ఇద్దరు కవలలు స్ట్రైడర్, అజూర్‌కు జన్మనిచ్చారు. అయితే 2014 ఫిబ్రవరిలో మస్క్ కు ఇద్దరు సంతానం కలిగారు. వారు.. కుమార్తె ఆర్కాడియా, కుమారుడు సెల్డాన్ లైకుర్గస్. వారిలో కొడుకు పేరులో శేఖర్‌ను చేర్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
ఇది ఆటోనా.. అంబులెన్సా.. అర్ధరాత్రి వేళ..
అర్ధరాత్రి రోడ్డుపై షాకింగ్ సీన్.. ఇరువైపులా ఆగిపోయిన వాహనాలు
