బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
దుబాయ్‌లో అస్థిర వాతావరణం, అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, పిడుగులతో కూడిన తుఫానులు సంభవించాయి. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడటం వైరల్‌గా మారింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ స్వయంగా ఈ అరుదైన దృశ్యం వీడియోను షేర్ చేశారు. నెటిజన్లను ఆశ్చర్యపరిచిన ఈ సంఘటన, భవనం యొక్క ప్రత్యేక రక్షణ వ్యవస్థను హైలైట్ చేసింది.
దుబాయ్‌లో వాతావరణం అస్థిరంగా ఉందని, అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన బుర్జ్ ఖలీఫా పై పిడుగు పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అరుదైన వీడియోను స్వయంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. భారీ వర్షం, ఉరుముల శబ్దాల మధ్య ఆకాశంలోంచి వచ్చిన ఓ పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకిన దృశ్యం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫోటోగ్రఫీ, ప్రకృతి పట్ల ఆసక్తి కలిగిన షేక్ హమ్దాన్, ఈ పోస్ట్‌కు ‘దుబాయ్’ అంటూ స్మాల్ క్యాప్షన్ ఇచ్చారు. ఆయనను ‘ఫజ్జా’ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 829.8 మీటర్ల ఎత్తుతో బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు సృష్టించింది. తరచూ పిడుగులు పడుతున్నా, భవనానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
గర్భిణీ శవాన్ని ఊర్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు.. ఎందుకంటే
అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు.. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో