Drought in Brazil: అమెజాన్‌లో తీవ్ర కరవు.! కరవులో చిక్కుకున్న డజన్ల కొద్ది తెగల ప్రజలు..

|

Sep 16, 2024 | 9:15 AM

బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ తీర ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. డజన్ల కొద్ది తెగల ప్రజలు కరవులో చిక్కుకున్నారు. తాగునీరు, ఆహారం, ఔషధాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నదిలోని నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో తగ్గి దాదాపు ఎండిపోయింది. అమెజాన్‌ అటవీ నిర్మూలనకు వాతావరణ మార్పులు తోడై ఉష్ణోగ్రతలు పెరిగి మరింత హాని కలిగిస్తోందని పర్యావరణవేత్తలు తెలిపారు.

అమెజన్‌ అటవీ పరిసర ప్రాంత రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో అవి అడవులకు వ్యాపించి వేల ఎకరాలు కాలిపోతున్నాయి. మానవ సంబంధిత చర్యల కారణంగా ఒక్క 2010 లోనే లక్షా 60 వేల కార్చిచ్చులు బ్రెజిల్‌లో రిజిష్టర్‌ అయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అప్పటి నుంచి బ్రెజిల్‌లో ఇటలీ దేశ విస్తీర్ణమంత ప్రాంతం కాలిబుడిదైంది. నదుల్లో నీరు ఎండి, బురదలో ప్రయాణించడం చాలా కష్టమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన కూరగాయలు, ఇతర సరుకులను నగర ప్రాంతాలకు తరలించేందుకు వేకవజామున లేచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు చెబుతున్నారు.

బ్రెజిల్‌లో అతిపెద్ద నగరమైన సావో పాలోలోని పిన్‌హీరోస్ నది రంగు అకస్మాత్తుగా మారిపోయింది. నీలి రంగు నుంచి బూడిద రంగు సంతరించుకుంది. తీవ్రమైన కరవు నేపథ్యంలో నీటి మట్టాలు క్షీణిస్తున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగుతున్న కారణంగా పొగలు అంతటా విస్తరిస్తున్నాయి. దీంతో నగరంలో గాలి కలుషితంగా మారింది. స్విస్ ఎయిర్ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూ ఎయిర్’ బాంబు పేల్చింది. సావో పాలో రాష్ట్రం ప్రపంచంలోనే రెండో కలుషిత రాష్ట్రంగా రికార్డుల్లోకి ఎక్కిందని తెలిపింది. పొగ ప్రభావం 2 కోట్లమందిపై పడిందని తెలిపింది. గాలి కలుషితం అయ్యిందని.. ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలని సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.