Srilanks: శ్రీలంకలో భగ్గుమన్న నిత్యావసర వస్తువుల ధరలు..!! గగ్గోలు పెడుతున్న జనం.. వీడియో

|

Oct 16, 2021 | 8:10 AM

ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిత్యావసరాల ధరలపై ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేయడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిత్యావసరాల ధరలపై ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేయడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. కేవలం రెండురోజుల వ్యవధిలోనే వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా 90% పెరిగి 2,657 రూపాయలకు చేరింది. లీటరు పాల ధర ఐదు రెట్లు పెరిగి 1,195 రూపాయలకు చేరింది. ఇంకా పప్పులు, పంచదార ఇలా నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా అన్నింటి ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: అమెరికాలో ఇళ్ల మధ్య కుప్పకూలిన విమానం..!! నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రమాద దృశ్యాలు.. వీడియో

Viral Video: ఆకాశం నుంచి దూసుకొచ్చిన మృత్యువు.. అదృష్టం బాగుండి.. !! వీడియో