China: గంటకు 453 కి.మీ హై స్పీడ్‌ రైలును ఆవిష్కరించిన చైనా

Updated on: Oct 24, 2025 | 5:02 PM

చైనాలో ఓ రైలు గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ రైలుకు సంబంధించిన ట్రయల్‌ రన్‌ షాంఘై-చోంగ్‌కింగ్-చెంగ్డూ రైల్వే మార్గంలో జరుగుతోంది.దీంతో ప్రపంచంలోనే టాప్‌ హై-స్పీడ్ రైలును ఆవిష్కరించి రైల్వే రవాణాలో చైనా మరో సంచలనంగా మారింది. ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి వచ్చాక, ఈ రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ప్రస్తుతం చైనాలో నడుస్తున్న సీఆర్ 400 ఫక్సింగ్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా సీఆర్ 450 దానికంటే అత్యాధునికమైంది. పాత మోడల్‌తో పోలిస్తే దీని బరువును 50 టన్నుల వరకు తగ్గించారు. గాలి నిరోధకతను 22 శాతం తగ్గించేందుకు ఏరోడైనమిక్ డిజైన్‌ను మెరుగుపరిచారు. ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలోనే సున్నా నుంచి గంటకు 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇటీవల రెండు సీఆర్ 450 రైళ్లు ఎదురెదురుగా ప్రయాణిస్తూ గంటకు 896 కిలోమీటర్ల సంయుక్త వేగాన్ని నమోదు చేసి మరో అరుదైన ఘనత సాధించాయి. ప్రయాణికుల సేవల్లోకి ప్రవేశపెట్టే ముందు, ఈ రైలు దాదాపు 6 లక్షల కిలోమీటర్ల దూరం ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు పూర్తయ్యాక, ఇది ప్రయాణికులకు మరింత నిశ్శబ్దమైన, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందించనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Golden Dress: మెరిసిపోతున్న గోల్డెన్‌ డ్రెస్‌ చూసారా

Srikakulam: ఎస్పీ చూస్తుండగానే.. MLA పైకి రివాల్వర్ ఎక్కుపెట్టిన మంత్రి

నెల రోజులు.. 28 లక్షల కోట్లు అదీ మన యూపీఐ కెపాసిటీ బాస్

రాష్ట్రపతి హెలికాప్టర్‌ను నెట్టిన సిబ్బంది

TOP 9 ET News: ప్రభాస్ రూ.3500 కోట్లు..ఫిల్మ్ ఫెటర్నిటీలో ఒకే ఒక్కడు