China secret survey Video: బుద్ధి మార్చుకొని చైనా.. భారత్‌పై కుట్రకు కశ్మీర్‌లో చైనా సీక్రెట్ సర్వే..!(వీడియో)
ప్రస్తుతం భారత్ ఒకేసారి చైనా, పాక్ రెండు సైన్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. భారత్ వ్యూహకర్తల అంచనాలను బలపరుస్తూ పీవోకే వద్ద పాక్ చైనాల మధ్య సైనిక సహకారం చకచకా సాగుతోంది. తాజాగా చైనా అత్యాధునిక ఫ్రిగేట్‌ను పాకిస్థాన్‌కు బహూకరించింది.
ప్రస్తుతం భారత్ ఒకేసారి చైనా, పాక్ రెండు సైన్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. భారత్ వ్యూహకర్తల అంచనాలను బలపరుస్తూ పీవోకే వద్ద పాక్ చైనాల మధ్య సైనిక సహకారం చకచకా సాగుతోంది. తాజాగా చైనా అత్యాధునిక ఫ్రిగేట్‌ను పాకిస్థాన్‌కు బహూకరించింది. అంతేకాదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా దళాల కదలికలు పెరిగిపోయాయి. అదే సమయంలో పీఎల్‌ఏ దళాలకు సహకరించేందుకు పాక్ అధికారులు చైనా చేరుకొన్నారు.
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సిబ్బంది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని సరిహద్దు చెక్‌పోస్టులు, గ్రామాల్లో రహస్య సర్వే నిర్వహించారు. ఈ విషయాన్ని భారతీయ దళాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. దాదాపు 40 మందికిపైగా చైనా సైనికులను నెల రోజుల క్రితం గుర్తించారు. వారు ఐదు నుంచి ఆరుగురు సభ్యుల బృందాలుగా విడిపోయి పీవోకేలోని కొన్ని గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు అక్కడ అత్యాధునిక గ్రామాలను నిర్మించేందుకు ఆసక్తి చూపారు. ఈ గ్రామాలను సైనిక, పౌర అవసరాలకు వినియోగించే అవకాశాలున్నాయి. ఇటువంటి గ్రామాన్నే అరుణాచల్ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రదేశంలో చైనా నిర్మించింది.చైనా నుంచి పాకిస్థాన్‌కు కుప్పలు తెప్పలుగా ఆయుధాలు చేరుతున్నాయి. అలాగే ఇరు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకొంటూ వెళుతున్నాయి. గతేడాది పీఎల్‌ఏ, పాక్ వాయుసేన కలిసి సింధ్‌లో ‘షహీన్-9’ యుద్ధవిన్యాసాలను నిర్వహించాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..