UN Secretary: ముంచుకొస్తున్న మరో యుద్ధం.. యూఎన్ సెక్రటరీ జనరల్‌వార్నింగ్.!
ప్రపంచం మరో సంక్షోభం దిశగా వెళ్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. ఇజ్రాయిల్, హిజ్‌బుల్లా మధ్య ముదురుతున్న ఘర్షణ.. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఈ అంశం గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిన ఘటనలో హిజ్‌బుల్లా సీనియర్ కమాండర్ హజ్ సామి తలేబ్ అబ్దుల్లా హతమయ్యాడు.
ప్రపంచం మరో సంక్షోభం దిశగా వెళ్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. ఇజ్రాయిల్, హిజ్‌బుల్లా మధ్య ముదురుతున్న ఘర్షణ.. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఈ అంశం గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిన ఘటనలో హిజ్‌బుల్లా సీనియర్ కమాండర్ హజ్ సామి తలేబ్ అబ్దుల్లా హతమయ్యాడు. ఈ నేపథ్యంలో షియా మిలిటరీ గ్రూపునకు చెందిన అధినేత హసన్ నస్రల్లా ఓ వార్నింగ్ ఇచ్చారు. వెస్ట్ జెరూసలేమ్‌లో పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగనున్నట్లు నస్రల్లా వార్నింగ్ ఇచ్చిన సందర్భంగా యూఎన్ సెక్రటరీ జనరల్ స్పందించారు.
ఓ మొండి నిర్ణయం, ఓ తప్పుడు అంచనా.. మరో భారీ విపత్తును సృష్టిస్తుందని, అది సరిహద్దుల్ని దాటేస్తుందని, ఊహించని రీతికి వెళ్తుందని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. లెబనాన్‌ను మరో గాజాగా చూడాలన్న కాంక్ష ప్రపంచానికి లేదన్నారు. రెండు దేశాలు శాంతి ప్రక్రియ చేపట్టాలని ఆయన ఇరు వర్గాలను కోరారు. లెబనాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న ఘర్షణకు మిలిటరీ పరిష్కారం కుదరదన్నారు. ఇటీవల ఇజ్రాయిల్, హిజ్‌బుల్లా .. అనేక సార్లు రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. దీని వల్ల 53 వేల మంది ఇజ్రాయిలీలు, లక్షల మంది లెబనీస్‌లు ఇళ్లు విడిచి వెళ్లారన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.