కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం

Updated on: Jan 01, 2026 | 7:58 PM

కెనడాలోని వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ఇండియా పైలట్ నిర్బంధానికి గురయ్యారు. ఆల్కహాల్ వాసన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యూటీ ఫ్రీ స్టోర్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించినట్లు గుర్తించారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో పైలట్ విఫలమవడంతో డిసెంబర్ 23న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కెనడాలోని వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ఇండియా పైలట్ నిర్బంధానికి గురయ్యారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న పైలట్ దగ్గర ఆల్కహాల్ వాసన రావడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక విచారణలో, సదరు పైలట్ ఎయిర్‌పోర్ట్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించినట్లు గుర్తించారు. అనంతరం, బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అందులో పైలట్ విఫలమయ్యారు. విధి నిర్వహణకు శారీరకంగా అనర్హుడని నిర్ధారించిన వాంకోవర్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఆపై పోలీసులు అతనిని నిర్బంధంలోకి తీసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు

ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..

మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

రూ. 15 వేల లోపు స్మార్ట్‌ఫోన్లు ఫీచర్లు మాములుగా లేవు