Zombie-Virus: మంచుమాటున జాంబి వైరస్‌.. కరోనా మించిన ప్రమాదమంటున్న శాస్త్రవేత్తలు..

|

Dec 04, 2022 | 9:52 AM

కరోనా మహమ్మారి బారినుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే రకరకాల కొత్త వైరస్‌లు మానవాళికి సవాలు విసురుతున్నాయి. తాజాగా 48,500 ఏళ్లనాటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.


రష్యాలోని సైబీరియా ప్రాంతం సంవత్సరంలో అత్యధిక భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి మంచు పొరల కింద సేకరించిన నమూనాలను యూరప్ పరిశోధకులు పరీక్షించారు. వాటిలో 13 రకాల హానికరమైన సూక్ష్మజీవ జాతులను గుర్తించి, వాటిని వర్గీకరించారు. వీటిని పరిశోధకులు జాంబీ వైరస్ లు గా భావిస్తున్నారు. వేల సంవత్సరాలుగా అవి నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ, వ్యాధి కారక శక్తిని మాత్రం కోల్పోలేదని తెలుసుకున్నారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు సంయుక్త పరిశోధనలో ఈ వైరస్‌ను గుర్తించారు. అత్యంత ఘనీభవించిన ఈ మంచు కరిగిపోతే బయటి వాతావరణంలోకి విడుదలయ్యే ఈ రాకాసి వైరస్ లు జంతువులకు, మానవాళికి పెను సమస్యగా పరిణమిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బాహ్య వాతావరణంలోకి ప్రవేశించాక ఎంతకాలం వ్యాధికారకంగా ఉంటాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో… ఈ వైరస్ లకు, మానవాళికి మధ్య వాహకాలు ఏమిటో అంచనా వేయడం ఇప్పటికీ అసాధ్యంగానే ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇవి కలిగించే ముప్పును అంచనా వేయలేమని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 04, 2022 09:52 AM