Rain Alert: మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

Updated on: Sep 03, 2025 | 7:44 AM

ఏపీ, తెలంగాణకు వర్షసూచన కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆతదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అలాగే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు అధికారులు.

నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.. అలాగే  విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.