Watch Video: మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..

| Edited By: Srikar T

Jun 18, 2024 | 7:08 PM

నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. స్థానిక ఈఓ అఫీసు సమీపంలో కుక్కల మందపై చిరుత దాడి చేసింది. ఓ కుక్కను చిరుత లాక్కెళ్ళడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఆలయ సమీపంలో చిరుత సంచారంను గమనించిన స్థానికులు మొబైల్ ఫోన్‎లో చిత్రీకరించారు. రాత్రి వేళల్లో చిరుత సంచరిస్తుండటంతో దర్శనానికి వచ్చే యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, పోలీసులు తగు చర్యలు చేపట్టాలని విజ్ఙప్తి చేస్తున్నారు.

నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. స్థానిక ఈఓ అఫీసు సమీపంలో కుక్కల మందపై చిరుత దాడి చేసింది. ఓ కుక్కను చిరుత లాక్కెళ్ళడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఆలయ సమీపంలో చిరుత సంచారంను గమనించిన స్థానికులు మొబైల్ ఫోన్‎లో చిత్రీకరించారు. రాత్రి వేళల్లో చిరుత సంచరిస్తుండటంతో దర్శనానికి వచ్చే యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, పోలీసులు తగు చర్యలు చేపట్టాలని విజ్ఙప్తి చేస్తున్నారు. చిరత సంచారంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలంటు ఆలయ అధికారులు మైక్‌ల ద్వారా ఆలయ పరిసరాల్లో ప్రచారం చేస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. చిరుత సంచారంపై ఆలయ ఈవో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగి అటవీశాఖ సిబ్బంది చిరుతను పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on