24 అంతస్తులు.. 2,200 పడకలు.. దేశంలోనే టాప్ సర్కారు హాస్పిటల్ రెడీ

Updated on: Jun 05, 2026 | 9:23 PM

ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. వరంగల్‌లో 56 ఎకరాల్లో నిర్మితమైన 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు తుది దశకు చేరుకున్నాయి. 2,200 పడకలు, 42 లిఫ్టులు, అత్యాధునిక వైద్య సదుపాయాలతో రూపొందుతున్న ఈ మెగా దవాఖాన ప్రారంభమైతే, కార్పొరేట్ వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుంది.

ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. వరంగల్-హనుమకొండ జంట నగరాల మధ్య పూర్వపు సెంట్రల్ జైలు స్థలంలో, 56 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం దాదాపు పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో ఐదు నెలల్లో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఈ సర్కారు దవాఖానలో 2,200 పడకలు, 42 లిఫ్టులు, అత్యాధునిక ల్యాబ్‌లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో అత్యవసర విభాగం , క్యాన్సర్ విభాగం, ఐసీయూలు, లేబర్ వార్డు, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో ఈఎన్‌టీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరోసర్జరీ, ఎండోస్కోపి, ఎక్స్‌రే విభాగాలు, 2, 3 అంతస్తుల్లో పిల్లల అత్యవసర విభాగం, నియోనాటల్ కేర్, ఐవీఎఫ్ కేంద్రం, 18 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. 4, 5 అంతస్తుల్లో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఐసీయూ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్, డెంటల్ విభాగాలు ఏర్పాటు చేశారు. 6 నుండి 10 అంతస్తుల్లో ఆర్థోపెడిక్ వార్డు, ప్లంబింగ్/ఎలక్ట్రికల్స్, పీడియాట్రిక్, గైనకాలజీ, శ్వాసకోశ వ్యాధులు, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు ఏర్పాటు చేయగా… 11, 12 అంతస్తుల్లో ఎండోక్రైనాలజీ, మానసిక వైద్యం, గ్యాస్ట్రో ఎంటరాలజీ వార్డులు ఉన్నాయి. 13, 14 అంతస్తుల్లో సెమీ, వీఐపీ ప్రైవేటు గదులు, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. 23, 24 అంతస్తుల్లో కాన్ఫరెన్స్ హాల్స్ ఏర్పాటు చేశారు. L&T సంస్థ రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, కార్పొరేట్ వైద్యం కోసం హైదరాబాద్‌కు పరుగులు పెట్టే అవసరం లేకుండా, ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు ఇది గుండెకాయగా మారుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటోలో 15 మందా? పాతబస్తీలో డేంజర్ జర్నీ!

చదివింది పది.. చేసేది లింగ నిర్ధారణ

‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్‌..

TTD: రికార్డ్‌ స్థాయిలో తిరుమల లడ్డూ విక్రయాలు.. ఒక్క మే నెలలోనే..

40 ఏళ్ల క్రితం హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. ! లొంగిపోయిన కిల్లర్

Follow Us