దంచికొట్టిన ఎండలు.. అయినా జనాల్లో డి విటమిన్ లోపం.. కారణమేంటి?
ఎండలు సమృద్ధిగా ఉండే భారతదేశంలోనే విటమిన్-డి లోపం తీవ్ర స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని దాదాపు 77 శాతం మంది ప్రజలు ఈ లోపంతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఐఎంఏ జూన్ 21ను ‘విటమిన్ డి డే ఆఫ్ ఇండియా’గా ప్రకటించింది. ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి విటమిన్-డి ఎంత ముఖ్యమో తెలియజేయడమే దీని లక్ష్యం.
భారతదేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఒక నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సరికొత్త చొరవ తీసుకుంది. ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ‘అబ్బాట్’ భాగస్వామ్యంతో, సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన రోజైన జూన్ 21ని ‘విటమిన్ డి డే ఆఫ్ ఇండియా’గా ఐఎంఏ ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 77 శాతం మంది ప్రజలు తీవ్రమైన విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారనే చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పొడవునా ఎండలు దంచికొట్టే భారత్‌లో ఈ స్థాయి విటమిన్ లోపం రావడాన్ని వైద్య నిపుణులు ‘సన్‌షైన్ పారడాక్స్’ గా అభివర్ణిస్తున్నారు. పుష్కలంగా సూర్యరశ్మి ఉన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో ప్రజలు ‘సన్‌షైన్ విటమిన్’ లోపంతో బాధపడుతుండటంపై ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనిల్‌కుమార్ జె.నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎముకల బలం, కండరాల పనితీరు, శరీర రోగనిరోధక శక్తిని కాపాడటంలో విటమిన్-డి పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలు రోజంతా ఇళ్లలోను లేదా ఏసీ ఆఫీసుల్లోనే గడపడం, శారీరక శ్రమ తగ్గడం. అంతేకాక, వాయు కాలుష్యం వల్ల సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ బి కిరణాలు చర్మానికి చేరకపోవడం, అతిగా సన్‌స్క్రీన్ లోషన్ల వాడకం కూడా డి విటమిన్ లోపానికి కారణంగా మారుతున్నాయి. మన దేశ ప్రజల్లో ముదురు చర్మ రంగులో మెలనిన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల చర్మంలో విటమిన్-డి సహజ ఉత్పత్తి తగ్గుతోంది. నీరసం, కండరాల నొప్పులు, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం దీని ప్రాథమిక లక్షణాలు. దీర్ఘకాలంలో ఇది ఎముకల క్షీణతకు దారితీస్తుంది. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో గడపాలని సూచిస్తున్నారు. కేవలం ఎండ మాత్రమే సరిపోకపోవచ్చని, క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆహార పదార్థాలలో విటమిన్-డిని ఫోర్టిఫికేషన్ చేయడం ద్వారానే ఈ నిశ్శబ్ద సంక్షోభాన్ని అరికట్టగలమని ఐఎంఏ స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశానికి చిల్లు పడిందా? వచ్చే మూడు రోజులు ఇళ్లలోనే ఉండండి!
చిన్న పామే కదా అని ఆటలాడాడు.. చివరికి ఇలా..
కస్టమర్‌లా వచ్చాడు.. షాపులో ఒంటరిగా ఉన్న మహిళను అదను చూసి..
వీడు మామూలోడు కాదు.. పామునే ఫుట్ బాల్ ఆడుకున్నాడుగా!
స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు.. రూ.20 నోటుతో దేవుడికి ‘సుపారీ’
