ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం.. హైలెట్ ఏమిటో తెలుసా ??

Updated on: Jan 26, 2026 | 9:35 AM

విశాఖపట్నంలో జనవరి 31 వరకు ఘనంగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్ ఎనిమిది రోజులపాటు నన్‌స్టాప్ పండుగ వాతావరణాన్ని అందిస్తోంది. ఆర్కే బీచ్, ఋషికొండ, గోకుల్ పార్క్, భీమిలి బీచ్‌లలో డ్రోన్, మ్యూజికల్ షోలు, సాహస క్రీడలు (స్కూబా డైవింగ్, పారా‌సైలింగ్), బోట్ రేసింగ్, సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ షో ప్రధాన ఆకర్షణలు. స్థానిక కళాకారుల ప్రదర్శనలు, పిల్లలు, మహిళలకు పోటీలతో పర్యాటకులకు పండుగ విందు.

విశాఖపట్నం లో ఘనంగా విశాఖ ఉత్సవ్ ప్రారంభమయింది. జనవరి 31 వరకు ఈ ఉత్సవం ఎనిమిది రోజులపాటు నాన్‌స్టాప్ ఫెస్టివల్‌గా జరగనుంది. ఆర్కే బీచ్ ప్రధాన వేదికగా, గోకుల్ పార్క్, ఋషికొండ, భీమిలి బీచ్‌లలోనూ ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉత్సవాలను ప్రారంభించారు. మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ హరేందిర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎనిమిది రోజులపాటు ప్రతి సాయంత్రం ఆర్కే బీచ్‌లో డ్రోన్ షో, మ్యూజికల్ షోలు జరుగుతాయని, గోకుల్ పార్కులో స్థానిక కళాకారుల ప్రదర్శనలు, ఋషికొండ బీచ్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్ — హెలి రైడ్స్, పారా‌సైలింగ్, స్కూబా డైవింగ్, కయాకింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భీమిలి బీచ్‌లో బోట్ రేసింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెంట్రల్ పార్క్‌లో 29, 30, 31 తేదీల్లో ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు. విశాఖ ఉత్సవ్‌లో ఈ ఫ్లవర్‌ షోషో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మూడు రోజులపాటు ఈ షోను ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు. పిల్లలకు చిల్డ్రన్స్ ఒలింపియాడ్, మహిళలకు ముగ్గులు, వంటల పోటీలు, కోస్టల్ వాలీబాల్, కబడ్డీ, ఫుట్‌బాల్ లీగ్‌లు కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారుల ప్రదర్శనలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా

Mega158: ‘జన నాయగన్‌’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ??

రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్‌ పోలీసులకు SKN ఫిర్యాదు

Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి

‘పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..’కట్ చేస్తే షాకింగ్ నిజం