డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు

Updated on: Dec 08, 2025 | 2:18 PM

జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు తమ కంపెనీలో ఉద్యోగాలకు డిగ్రీ అవసరం లేదని, నైపుణ్యాలే కీలకమని స్పష్టం చేశారు. డిగ్రీల కోసం అప్పులు చేయకుండా, స్కిల్స్ మెరుగుపరుచుకోవాలని యువతకు సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై డిగ్రీల కోసం ఒత్తిడి చేయొద్దన్నారు. ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చే కంపెనీలు అవకాశాలిస్తున్నాయని, ఈ విధానం భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు మార్గం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తన కంపెనీలో ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. డిగ్రీ చదువుల గురించి ‘ఎక్స్’లో పోస్ట్‌ పెట్టారు. తమ సంస్థలో ఉద్యోగం పొందడానికి డిగ్రీ తప్పనిసరి కాదని అన్నారు. డిగ్రీ చదవాలంటూ పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయకూడదని సూచించారు. ప్రస్తుతం అమెరికాలో కొంత మంది ప్రతిభావంతులైన విద్యార్థులు కాలేజ్‌కు వెళ్లడం మానేస్తున్నారని, ముందుచూపు కలిగిన సంస్థలు వారికి అవకాశాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. ఒక కాగితం ముక్క కంటే ప్రతిభ, నేర్చుకోవాలనే ఆసక్తి చాలా ముఖ్యమని తెలిపారు. డిగ్రీల కోసం అప్పులు చేసే బదులు, స్కిల్స్‌ మెరుగుపరుచుకోవడం మేలని, దీని ద్వారా యువత ప్రపంచాన్ని చూసే విధానం మారుతుందని అన్నారు. ఈ మార్పును తల్లిదండ్రులు అర్థం చేసుకొని, పిల్లలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించాలని శ్రీధర్ వెంబు సూచించారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఇలాంటి ఆలోచన దృక్పథం భారత్‌లో ఉండాలని.. ఇలా ఉద్యోగంలోనే నేర్చుకునేలా జోహో వంటి కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. కంపెనీలు డిగ్రీల కంటే టాలెంట్‌కే విలువ ఇవ్వాలని మరొకరు అన్నారు. క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన జోహో కార్పొరేషన్‌కు సీఈఓగా పనిచేసిన శ్రీధర్ వెంబు.. ఇప్పుడు కంపెనీ చీఫ్ సైంటిస్ట్‌గా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించారు. కృత్రిమ మేథలో వస్తున్న మార్పులు సహా తమ సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇతర అవకాశాల దృష్ట్యా.. ఆయన ఈ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం

మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు

Akhanda 2: అఖండ 2 ముందున్న అతిపెద్ద సవాల్ అదే

సంక్రాంతికి నేనూ ఉన్నాను అంటున్న సిక్స్ ప్యాక్ హీరో