పోస్ట్ చూడగానే వ్యూస్ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు
ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్, వ్యూస్ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫేక్ వీడియో పోస్ట్ చేసిన యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోను నిజమని భావించిన పోలీసులు వెంటనే స్పందించి అతడిని గుర్తించారు. తర్వాత అది కేవలం సోషల్ మీడియా పాపులారిటీ కోసం చేసిన డ్రామా అని తేలడంతో చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ రాజేష్ చంద్ర తీవ్రంగా స్పందించారు.
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని, వ్యూస్, లైక్స్ కోసం చాలామంది రకరకాల వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో కొందరి ధోరణి శ్రుతి మించుతోంది. ఫాలోవర్లను సంపాదించుకోవడం కోసం, లైక్‌ల కోసం ఇష్టారీతిన వీడియోలు రూపొందిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన పోస్ట్ చూసి పరుగెత్తుకెళ్లిన పోలీసులకు ఊహించని సీన్ ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్, లైక్స్ కోసం ‘ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ ఫేక్ వీడియో పోస్ట్ చేసిన ఓ యువకుడిపై కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు సోషల్ మీడియాలో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు. ఇది చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, సాంకేతికత సహాయంతో అతని ఇంటిని కనిపెట్టి విచారించారు. అయితే, కేవలం లైక్స్ కోసమే అలా చేశానని రోహిత్ ఒప్పుకోవడంతో అతనిపై కేసు నమోదుచేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తీవ్రంగా స్పందించారు. ఒక తప్పుడు పోస్ట్ వల్ల పోలీస్ యంత్రాంగం మొత్తం అత్యవసర పరిస్థితిగా భావించి పరుగులు తీయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల నిజంగా ఆపదలో ఉన్న వారికి సాయం అందడంలో ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విలువైన సమయం మరొకరి ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడాలి అని ఎస్పీ హితవు పలికారు. సోషల్ మీడియా వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. ఇలాంటి కేసుల వల్ల యువత కష్టపడి చదివిన చదువు, బంగారు భవిష్యత్తు ఒక్క పోస్ట్‌తో నాశనం అవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టేలా జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని సూచించారు ఎస్పీ. ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీసుల సమయాన్ని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన
మగవాళ్లలో వై క్రోమోజోమ్ అంతరించిపోతే..? శాస్త్రవేత్తల ఆసక్తికర వివరణ
జస్ట్ 30 నిమిషాల్లో.. 12 కి.మీ జర్నీ హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు టెకీ ఫిదా..
ఏడాదికి 50 లక్షల జీతం.. 10 వేల ఫోన్.. ఆటోలో ఆఫీసుకు.. ఈ ఐటీ ఉద్యోగిని కథ వైరల్
ఫ్రిజ్‌లో కూరగాయలు కుళ్ళిపోతున్నాయా ?? అద్భుతమైన చిట్కా మీకోసం
