ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా.. వీడియో
నొప్పి, బాధ అనేవి మనిషిలో ఉండే సహజ లక్షణాలు. చిన్న గాయం తగిలినా, శస్త్ర చికిత్సలు జరిగినా దాని తాలూకు నొప్పి లేదా మంట ఆ బాధ అనుభవించాల్సిందే. కానీ ఓ మహిళలో మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. పైగా అవి త్వరగా మానిపోతాయి. ఆమెలోని ఈ అరుదైన లక్షణమే ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.. ఈ అరుదైన జన్యు వైవిధ్యం సైన్స్‌కు మరో కొత్త సవాల్‌గా మారింది.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ అనస్థీషియాలో ప్రచురితమైన ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈమె పేరు కామెరాన్. ఈమెలోని నొప్పిలేని లక్షణం 2019లో బయటపడింది. దీని ఆధారంగా జన్యుశాస్త్రంలో మరిన్ని రహస్యాల ఛేదనపై పరిశోధకులు ఫోకస్ చేశారు. 65 ఏళ్ళ వయసులో కామెరాన్ తుంటి సమస్యకు వైద్య సహాయం తీసుకున్నప్పుడు ఆమె కండిషన్ బయటపడింది, తీవ్రమైన నడుము నొప్పి లేదా జాయింట్ డీజనరేషన్ ఉన్నప్పటికీ, ఆమెకు ఏ మాత్రం నొప్పి కలగలేదు. తర్వాత ఆపరేషన్ చేసినప్పుడు కూడా నొప్పి, మంట లేకపోవడంతో మహిళకు సంబంధించి జన్యు విశ్లేషణ చేయగా, జన్యువులలో రెండు వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆవిష్కరణ సరికొత్త నొప్పి నివారణ ఔషధాలకు మరో కొత్త మార్గాన్ని క్రియేట్ చేసిందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కస్టమ్స్ చేతికి చిక్కిన 16 అరుదైన పాములు వీడియో
సారీ నాన్న.. ఇక భరించలేను..! పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూ*సైడ్ వీడియో
మా అమ్మ చనిపోదామంటోంది… ఆదుకోండి కలెక్టర్‌కు బాలుడు విజ్ఞప్తి వీడియో