హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని

Updated on: Apr 28, 2025 | 8:14 PM

మద్యం మత్తులో కొంత మంది చేసే హంగామా మామూలుగా ఉండదు. రోడ్డుపై వాహనాలకు ఎదురొచ్చి డ్రైవర్లను టెన్షన్‌ పెడుతుంటారు. మందు తాగిన కిక్కులో ఓ యువతి అర్ధరాత్రి హైవేపై రచ్చ రచ్చ చేసింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ యువతి అర్ధరాత్రి డెహ్రాడూన్, ఢిల్లీ హైవే పై నడుస్తూ.. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు చుక్కలు చూపించింది.

హైవేపై వచ్చే కార్లు, బైకులను అడ్డుకుంది. ఓ స్కూటీని ఆపి.. వెనుక సీట్లో కూర్చుంది. మరోవైపు అకస్మాత్తుగా ఓ కారును ఆపి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆమె సడన్‌గా ఓ కారును ఆపడంతో రెండు కార్లు స్వల్పంగా ఢీకొన్నాయి. ఇది గమనించిన కొంత మంది పాదాచారులు తమ ఫోన్‌లలో వీడియోలు తీశారు. మరోవైపు యువతితో కొందరు మాట్లాడే ప్రయత్నం చేయబోయారు. అప్పటికే ఆమె అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ప్రవర్తన పై నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకుందా? అని నెటిజన్లు ప్రశ్నించారు. కాగా, ఆ మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. ఆమె నిజంగా మద్యం మత్తులో ఉందా లేదా అనేది కూడా నిర్ధారణ కాలేదు. రాత్రి మద్యం మత్తులో యువతి వీరంగం సృష్టించిందని, మహిళపై చర్యలు తీసుకోవాలని హరిద్వార్ పోలీసుల అధికారిక ఎక్స్ హ్యాండిల్‌కు వీడియోను యూజర్లు షేర్ చేశారు. ఈ వీడియో పై పోలీసులు ఇంకా స్పందించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంతకు ముందు ఎవరూ చూడని కొత్త రంగు ‘ఓలో’ కనిపించిందోచ్‌

ఇతనో వెరైటీ ఎలక్ట్రీషియన్‌.. ఇతని ఐడియాకి అంతా అవాక్కే

చర్మం కాంతివంతంగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు

సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండాలంటేఎలాంటి ఫ్రూట్స్‌ తినాలి ??

స్టార్ క్రికెటర్‌కు విడాకులిచ్చి.. దిల్ రాజు సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చి