Air India Express: విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై

|

May 17, 2024 | 11:52 AM

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్యాబిన్‌ సిబ్బంది ఇటీవల చేపట్టిన ఆందోళనతో వందల సంఖ్యలో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాంతో సంస్థ ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండ, అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో హృదయ విదారక సంఘటన ఒకటి వెలుగు చూసింది. విమానం రద్దు కారణంగా ఓ మహిళ ఒమన్‌లోని ఆసుపత్రిలో ఉన్న తన భర్తను బతికుండగా చూడలేకపోయింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్యాబిన్‌ సిబ్బంది ఇటీవల చేపట్టిన ఆందోళనతో వందల సంఖ్యలో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాంతో సంస్థ ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండ, అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో హృదయ విదారక సంఘటన ఒకటి వెలుగు చూసింది. విమానం రద్దు కారణంగా ఓ మహిళ ఒమన్‌లోని ఆసుపత్రిలో ఉన్న తన భర్తను బతికుండగా చూడలేకపోయింది. గుండెపోటుకు గురైన ఆయన.. రెండు రోజుల తర్వాత కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తిరువనంతపురానికి చెందిన అమృత భర్త ఒమన్‌లో ఉంటున్నారు. ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చేరిన భర్తతో ఫోన్‌లో మాట్లాడిన అతని భార్య సాధ్యమైనంత తొందరగా అక్కడికి వస్తానని చెప్పింది. వెంటనే మే 8న మస్కట్‌కు టికెట్‌ బుక్‌ చేసుకొని ఎయిర్‌పోర్టుకు చేరుకోగా విమానం రద్దైనట్లు తెలిసింది. తన భర్త పరిస్థితి చెప్పడంతో మరుసటిరోజు వెళ్లేందుకు విమానయాన సిబ్బంది మరో టికెట్‌ ఇచ్చారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ రోజు విమానం కూడా రద్దయ్యింది. చివరకు ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కూడా ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఇలా రెండు రోజులు గడిచింది. ఈ క్రమంలోనే భర్త కన్నుమూశారనే సమాచారం వచ్చింది. దీంతో భర్తను బతికుండగా చివరిసారి చూడలేకపోయానని అమృత రోదించడం స్థానికులను కలచివేసింది. ఈనేపథ్యంలో ఎయిరిండియా తీరుపై అమృత కుటుంబసభ్యులు మండిపడ్డారు. వేరే విమానంలో వెళ్లేందుకు ఏర్పాటుచేయాలని వేడుకున్నప్పటికీ.. వారినుంచి ఎటువంటి సాయం అందలేదన్నారు. ఆసుపత్రిలో చేరిన భర్త.. భార్యా పిల్లలను చూడాలని కోరుకున్నాడని అన్నారు. మస్కట్‌ వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ చివరిసారైనా చూడలేకపోయామని విలపించారు. తాజా ఘటనపై ఎయిర్‌లైన్స్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Banana: అరటిపళ్లను ఇలా మగ్గిస్తే.. ఆ టేస్టే వేరబ్బా

టీమిండియా కొత్త హెడ్ కోచ్‌కు దరఖాస్తులు.. అర్హతలు ఇవే

Chat GPT: అత్యాధునిక ఫీచర్లతో చాట్ జీపీటీ-4ఓ.. అందరికీ ఫ్రీ

బైక్‌పై ఎలుగుబంటి సరదా సరదాగా షికారు.. వీడియో నెట్టింట ఫుల్ వైరల్

Published on: May 17, 2024 11:51 AM