Woman Stomach: కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా డాక్టర్ల మైండ్ బ్లాంక్.!

Updated on: Jun 16, 2022 | 11:32 AM

గత కొంతకాలంగా ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతోంది. మొదట్లో లైట్‌ తీసుకున్నా ఆమె ఇంట్లోనే వైద్యం చేయించుకునేది. దాని వల్ల కడుపు నొప్పి తగ్గకపోగా.. మరింత పెరిగిపోవడంతో


గత కొంతకాలంగా ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతోంది. మొదట్లో లైట్‌ తీసుకున్నా ఆమె ఇంట్లోనే వైద్యం చేయించుకునేది. దాని వల్ల కడుపు నొప్పి తగ్గకపోగా.. మరింత పెరిగిపోవడంతో ఇక చేసేదేమీ లేక చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు ఆమెకు స్కాన్ చేసి.. రిపోర్ట్స్ చూడగా.. వారికి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఓ విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే..పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాకు చెందిన హీరా షేక్ అనే మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆమె మొదట్లో ఆ నొప్పిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అది క్రమేపీ పెరుగుతూ తీవ్రమైన నొప్పిగా మారడంతో స్థానిక సబ్ డివిజినల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లింది. డాక్టర్లు సదరు మహిళకు స్కానింగ్ చేయగా.. రిపోర్ట్స్‌లో ప్లాస్టిక్, వ్యర్ధాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆమె కడుపులో నుంచి 100 గ్రాముల ప్లాస్టిక్, వ్యర్ధాలను ఆపరేషన్ ద్వారా తొలగించారు వైద్యులు. ఈ శస్త్ర చికిత్సకు ‘హార్ట్ మ్యాన్ ఆపరేషన్’గా డాక్టర్లు నామకరణం చేశారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం బాగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్లే ఈ వ్యర్ధాలు కడుపులో ఏర్పడ్డాయని డాక్టర్లు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

 

Published on: Jun 16, 2022 11:32 AM
Follow Us