అర్ధరాత్రి మిస్టరీ మహిళ సంచారం.. డోర్‌బెల్స్‌ మోగిస్తుండటంతో జనంలో భయం

Updated on: Mar 31, 2025 | 8:33 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మార్చి 19 అర్థరాత్రి ఓ భయానక ఘటన జరిగింది. ఓ మిస్టరీ మహిళ అర్ధరాత్రి వీధుల్లో సంచరించింది. పలు ఇళ్ల డోర్‌బెల్స్‌ మోగించింది. ముసుగు వేసుకున్న ఆ మహిళను చూసి పశువులు కూడా భయంతో పారిపోయాయి. ఇది తెలిసి జనం భయపడిపోతున్నారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మార్చి 19న అర్ధరాత్రి వేళ ముసుగు వేసుకున్న ఒక మహిళ వీధుల్లో సంచరించింది. పలు ఇళ్ల వద్ద డోర్‌ బెల్స్ మోగించింది. కొందరు స్పందించి ఎవరని అడిగినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆ వీధిలోని పశువులు కూడా ఆ మహిళను చూసి భయంతో పారిపోయాయి. ఆమెను చూసిన కొందరు జడుసుకుని అనారోగ్యం పాలయ్యారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇది తెలిసి ఆ ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ మిస్టరీ మహిళ గురించి నిజం ఏమిటో తాము తేలుస్తామని, ఎవరూ భయాందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నారు. అయితే ప్రాంక్ కోసం ఎవరో ఇలా ప్రయత్నించినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య వేధింపులతో నరకం చూస్తున్నా.. కాపాడండి బాబోయ్